»   » ట్రేడ్ టాక్ :'సర్దార్' తో పవన్ నెంబర్ వన్ అని ప్రూవైంది,ఎలాగంటే

ట్రేడ్ టాక్ :'సర్దార్' తో పవన్ నెంబర్ వన్ అని ప్రూవైంది,ఎలాగంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్... భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోకే ఈ టాక్ అంతటా స్ప్రెడ్ అయ్యింది. అలాంటి పరిస్దితుల్లో వేరే హీరో సినిమా కలెక్షన్స్ పూర్తి స్దాయిలో మాట్నికే డ్రాప్ అయ్యిపోతాయి. కానీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ కలెక్షన్స్ రెండో రోజు,మూడో రోజు తగ్గినా పూర్తిగా పడిపోవటం మాత్రం జరగలేదు.

అంతేకాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విడుదలైన శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. టాలీవుడ్ లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా బాహుబలి తర్వాతి స్థానంలో సర్దార్ గబ్బర్ సింగ్ నిలిచింది. శ్రీమంతుడి చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది.


అనుష్క, ప్రబాస్, రాజమౌళి , అంతకుమించి చిత్రంలో అద్బుతమైన గ్రాఫిక్స్ ఉన్న బాహుబలి చిత్రంకి పోటీ ఇవ్వటం మామూలు విషయం కాదు. కేవలం పవన్ అనే ఒక్కరి స్టామినా మీద రిలీజైన చిత్రం ఇది. దర్శకుడుగా బాబికి అద్బతమైన ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. రెండో చిత్రమే అతనిది. అలాగే...బాహుబలి స్దాయి బడ్జెట్ కాదు. ఆ స్దాయి విజువల్స్ లేవు. ఇదంతా ఎలా సాధ్యం అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పాలి. ఆయనే నెంబర్ వన్ అని చెప్పాలి.


Sardaar Movie proves Pawan Kalyan power

పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తో ఓపెన్ అయినా, పవన్ అభిమానులను అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలు, బాలీవుడ్ లో 2 వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.


దీనికితోడు దాదాపు 42 దేశాల్లో 180కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. కాగా తొలి రోజు రికార్డు కలెక్షన్లు వచ్చినా, రెండో రోజు శనివారం తగ్గినట్టు శ్రీనాథ్ చెప్పాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే డివైడ్ టాక్ కారణంగా రెండో రోజు చాలా ప్రాంతాల్లో కలెక్షన్లు తగ్గాయి.

English summary
With a damaging negative talk spread after very first benefit show, ‘Sardaar’ gets massive collections on first day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu