»   » ఇక్కడ సరే...‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీ వెర్షన్ పరిస్ధితి?

ఇక్కడ సరే...‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీ వెర్షన్ పరిస్ధితి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీ వెర్షన్ కలెక్షన్స్ పరిస్దితి దారుణంగా ఉన్నట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు రెండు రాష్ట్రాల్లో తొలి రోడు రికార్డ్ లు బ్రద్దలు కొడితే...హిందీ వెర్షన్ మొదటి రోజు ఓపినింగ్స్ ఓ మాదిరికూడా తెచ్చుకోలేని పరిస్దితి ఏర్పడింది.

అప్పటికీ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఈ చిత్రం హిందీ వెర్షన్ రిలీజ్ ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. నాలుగు కోట్ల రూపాయలు మొత్తం వెచ్చింది రిలీజ్ చేసారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం తొలి రోజు నెట్ చాలా తక్కువ వసూలు చేసి నిరాశపరిచిందని చెప్తున్నారు. అంటే తొలిరోజే పూర్తి స్దాయి డెఫిషిట్ నమోదు చేసిందన్నమాట.


అక్కడ ఈ సినిమాకు బాలీవుడ్ లో చాలా బ్యాడ్ రివ్యూలు రావటం, అసలు మౌత్ టాక్ లేకపోవటంతో భాక్సాఫీస్ వద్ద పూర్తిగా వెనుకపడింది. పవన్ కళ్యాణ్ అప్పటికీ హిందీ మీడియాకు ఇంటర్వూలు సైతం ఇచ్చారు. పెద్ద పెద్ద మీడియా సంస్దల సహకారంతో ఈ సినిమా గురించి గొప్పగా రాయించారు....చెప్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.


Sardar Hindi version postion:heavy losses

బాహుబలిని దాటకపోయినా ఆ సినిమాలా అక్కడ బాగా ఆడుతుందని భావించారు. అయితే పూర్తి స్దాయిలో నిరాశపరిచింది. అక్కడ రివ్యూలు ఈ సినిమాని దారుణంగా ఏకేసాయి. మరో ప్రక్క కమాల్ ఆర్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై ట్వీట్ల ద్వారా సినిమాని విమర్శిస్తూ వచ్చాయి.


ఏదైమైనా ఈ సినిమాతో పవన్ ..బాలీవుడ్ ఎంట్రీ సజావుగా సాగుతుందనుకుంటే అది జరగలేదు. ఇది పవన్ కే కాదు ఆయన అబిమానులను నిరాసపరిచే అంశమే. సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న కలెక్షన్స్ కొద్దిలో కొద్ది ఊరట.

English summary
‘Sardaar Gabbar Singh’ in Hindi just collected very little amout as Nett on its release day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu