Just In
- 5 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 42 min ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 46 min ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
- 59 min ago
చెడ్డి దోస్తాన్ వాల్యూ చూపించిన రామ్ చరణ్.. యువ హీరోకు సడన్ సర్ ప్రైజ్
Don't Miss!
- News
259 మంది సభ్యులతో కమిటీ.. కేసీఆర్, జగన్, చంద్రబాబుకు చోటు, తెలుగువారు వీరే..
- Sports
ఆ సమయంలో పంత్ స్కూప్ షాట్.. ఎవరైనా ఇలా ఆడగలరా అంటూ మాజీల ఆశ్చర్యం వీడియో
- Automobiles
కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్.. గత రికార్డులను తుడిచేస్తూ! ఈ 16 రోజుల్లోనే..
వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి సత్తా చాటుతున్నారు. తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో గత రికార్డులను తిరగారాస్తున్నారు. మొదటి రోజే కలెక్షన్ల ప్రవాహానికి తెరలేపిన ఈ సినిమా రెండు వారాలు ముగించుకొని మూడో వారంలోనూ అదే జోష్ కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలై మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపిన ఈ సినిమా ఈ 16 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దామా..

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ హంగామా
రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వీక్ లోకి వచ్చాక సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్స్ కొంచెం స్లో అయినట్లు కనిపించింది కానీ వీకెండ్ వచ్చేసరికి మళ్ళీ పుంజుకోవడం విశేషం. 16వ రోజు సరిలేరు నీకెవ్వరు సినిమా ఏకంగా 2.5 కోట్లకు పైనే రాబట్టి భేష్ అనిపించుకుంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు మేనియా కనిపిస్తోంది.

ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ హిట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులను తన పేరిట లిఖించుకుంటూ సరికొత్త ఫీట్స్ సాధిస్తోంది. మహేష్ ఛరిస్మా, సంక్రాంతి సీజన్ కలసి రావడంతో ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తోంది.

మొత్తం ఈ 16 రోజుల్లో వసూళ్లు..
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ 16 రోజుల్లో 109 కోట్లకు పైన వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు మూవీ. నేటికీ సూపర్ సక్సెస్ సినిమాగా దూసుకుపోతున్న ఈ సినిమా మరికొన్ని రోజులు ఇలాగే ఆక్యుపెన్సీ కొనసాగిస్తే బాహుబలి 1 పేరిట ఉన్న రికార్డులను కూడా చెరిపేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

సరిలేరు నీకెవ్వరు 16 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏరియావైజ్
నైజాం : 36.29 కోట్లు
సీడెడ్ : 15.07 కోట్లు
గుంటూరు : 9.52 కోట్లు
ఉత్తరాంధ్ర : 18.57 కోట్లు
తూర్పు గోదావరి : 10.88 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.15 కోట్లు
కృష్ణ : 8.51 కోట్లు
నెల్లూరు : 3.95 కోట్లు
మొత్తం షేర్ : 109.94 కోట్లు

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ కేరీర్ లోనే
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మొత్తానికైతే ఈ సినిమా ఇప్పటికే కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది.