»   »  ఫస్ట్ డే కలెక్షన్స్: ‘సరైనోడు’ పరిస్థితి ఏంటి?

ఫస్ట్ డే కలెక్షన్స్: ‘సరైనోడు’ పరిస్థితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. 2016 సంవత్సరంలో 'సర్దార్ గబ్బర్ సింగ్', 'నాన్నకు ప్రేమతో' చిత్రాల తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ కావడంతో 'సరైనోడు' చిత్రంపై ముందు నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహించారు. ఇది కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది.

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో 'సరైనోడు' చిత్రం 875 లొకేషన్లలో మొత్తం 950 స్క్రీన్లలో విడుదలైంది. తొలి రోజు కొన్ని చోట్ల తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేసారు. అన్ని చోట్ల నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా చోట్ల టికెట్లు అడ్వాన్స్ గానే బుక్ అయ్యాయి. తొలి రోజు 80 నుండి 90 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.

తొలి రోజు ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో రూ. 13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేసారు. డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 10.03 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ గత చిత్రాలను సన్నాఫ్ సత్యమూర్తి(రూ. 9.27 కోట్లు), రేసుగుర్రం(రూ. 6.89 కోట్లు) తొలిరోజు కలెక్షన్లను ఈ చిత్రం అధిగమించింది.

ఈ ఏడాది ఓపెనింగ్స్ విషయంలో సర్దార్ గబ్బర్ సింగ్ తొలి రోజు రూ. 20.92 కోట్లతో మొదటి స్తానంలో ఉండగా... నాన్నకు ప్రేమతో రూ. 12.18 కోట్లతో రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత మూడో స్థానంలో 'సరైనోడు' నిలిచింది.

స్లైడ్ షోలో ఏరియావైజ్ కలెక్షన్స్ వివరాలు..

నైజాం

నైజాం


నైజాం ఏరియాలో సరైనోడు తొలి రోజు రూ. 2.69 కోట్లు వసూలు చేసింది.

సీడెడ్

సీడెడ్


సీడెడ్ ఏరియాలో సరైనోడు తొలి రోజు రూ. 2.13 కోట్లు వసూలు చేసింది.

వైజాగ్

వైజాగ్


వైజాగ్ ఏరియాలో సరైనోడే తొలి రోజు రూ. 74 లక్షలు వసూలు చేసింది.

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి


ఈ ఏరియాలో సరైనోడు తొలి రోజు రూ. 1.02 కోట్లు వసూలు చేసింది.

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి


వెస్ట్ గోదావరిలో సరైనోడే తొలి రోజు రూ. 1.03 కోట్లు వసూలు చేసింది.

కృష్ణ

కృష్ణ


కృష్ణ ఏరియాలో సరైనోడే తొలి రోజు రూ. 57 లక్షలు వసూలు చేసింది.

గుంటూరు

గుంటూరు


గుంటూరు ఏరియాలో సరైనోడు తొలి రోజు రూ. 1.37 కోట్లు వసూలు చేసింది.

నెల్లూరు

నెల్లూరు


నెల్లూరు ఏరియాలో సరైనోడు తొలి రోజు రూ. 52 లక్షలు వసూలు చేసింది.

టోటల్

టోటల్


సరైనోడు తొలి రోజు ఏపీ, తెలంగాణల్లో టోటల్ రూ. 10.07 కో కోట్లు వసూలు చేసింది.

English summary
"Sarrainodu" collected a decent amount at the Andhra Pradesh and Telangana (AP/T) box office on the first day. The Allu Arjun starrer has become the 3rd biggest opener of 2016 after "Sardar Gabbar Singh" and "Nannaku Prematho."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu