For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  GODSE Movie Business: సత్యదేవ్‌ సినిమాకు ఊహించని బిజినెస్.. గాడ్సే ఎన్ని కోట్లు వసూలు చేయాలంటే!

  |

  సపోర్టింగ్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ సెన్సేషన్ సత్యదేవ్. కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అతడు.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మీ' అనే మూవీతో హీరోగా మారాడు. అంతేకాదు, అదిరిపోయే నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సత్యదేవ్ ఇప్పుడు 'గాడ్సే' అనే సినిమా చేశాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

  ‘గాడ్సే'గా మారిపోయిన సత్యదేవ్

  ‘గాడ్సే'గా మారిపోయిన సత్యదేవ్

  టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రమే 'గాడ్సే'. గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కించిన ఈ సినిమాను సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మించారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. సునీల్ కశ్యప్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో నాగబాబు, బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి, నోయల్ సీన్, పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

  స్మిమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి అందాల ఆరబోత: తడిచిన బట్టల్లో యమ హాట్‌గా!

  యువకుడి పోరాటం నేపథ్యంతో

  యువకుడి పోరాటం నేపథ్యంతో

  వినూత్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సత్యదేవ్ నటించిన 'గాడ్సే'.. ప్రభుత్వం తీసుకునే లోటుపాట్లపై ఓ యువకుడు చేసే పోరాటంతో రూపొందింది. ఈ మూవీ సందేశాత్మకమైన కథతో రాబోతుంది. దీన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇందులో సత్యదేవ్ పాత్ర మరింత హైలైట్‌గా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.

  వాయిదాలు.. రిలీజ్ డేట్ ఖరారు

  వాయిదాలు.. రిలీజ్ డేట్ ఖరారు

  రాజకీయ వ్యవస్థపై హీరో చేసే పోరాటంతో తెరకెక్కిన 'గాడ్సే' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు డేట్లను కూడా ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇక, ఈ సినిమాను జూన్ 17న విడుదల చేయబోతున్నారు.

  డార్క్ రూమ్‌లో బ్రాతో పాయల్: ఈ ఫోజు చూసి తట్టుకోవడం కష్టమే

  ప్రమోషన్స్ షురూ... అంచనాలు

  ప్రమోషన్స్ షురూ... అంచనాలు

  పూర్తి స్థాయి కమర్షియల్ కథతో సందేశాత్మకంగా రాబోతున్న 'గాడ్సే' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అంతేకాదు, బుల్లితెరపై ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ప్రసారం అయ్యాయి. అలాగే, ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్లను కూడా భారీగా ప్లాన్ చేశారు.

  ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

  ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

  సత్యదేవ్ 'గాడ్సే' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 1.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 1.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలను కలిపి మొత్తంగా రూ. 3.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ టాక్.

  బ్రాతో పునర్నవి హాట్ సెల్ఫీ: నేను ఆ పని చేయడానికే వచ్చానా అంటూ!

  ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా

  ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా

  సత్యదేవ్ సినిమాలకు రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో 'గాడ్సే' సినిమాకు ఓవర్సీస్‌‌తో పాటు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 4.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫలితంగా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లుగా నమోదు అయింది.

  English summary
  Satyadev Kancharana Now Did Godse Movie Under Gopi Ganesh Direction. Lets Know This Movie Pre Release Business Details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X