For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇండస్ట్రీ షాక్ : మెగా ఎంట్రీ...'బాహుబలి' తో సహా మొత్తం స్టార్ హీరోల రికార్డ్ లు బ్రద్దలు

  By Srikanya
  |

  హైదరాబాద్: ఈమధ్యకాలంలో తెలుగు సినిమా ఓవర్‌సీస్ మార్కెట్‌పై ఎక్కువగా దృష్టిపెడుతుంది. బిజినెస్‌లో అగ్రభాగాన్ని ఓవర్‌సీస్ రైట్స్ రూపంలో జమచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 2000 సంవత్సరం వరకు పెద్దగా ఓవర్‌సీస్ కలెక్షన్లపై ఆసక్తిచూపని టాలీవుడ్ ఇప్పుడు ఓవర్‌సీస్ మార్కెట్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది.

  అతి తక్కువ ధరలకు ఓవర్‌సీస్ రైట్స్‌ని దక్కించుకుని బాగా లాభాలు గడించిన వ్యక్తులను గమనించిన చాలామంది నేడు ఓవర్‌సీస్ రైట్స్‌ని పెంచేసారు. ఇప్పుడు ఓవర్‌సీస్‌లో కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్‌లు వెలిసాయి. అందుకే ఓవర్‌సీస్ రైట్స్ అగ్ర హీరోల సినిమాలకు.. క్రేజీ దర్శకుల సినిమాలకు మంచి రేటు పలుకుతున్నాయి.

  ఓవర్‌సీస్ రైట్స్ విషయంలో బాలీవుడ్ వంద కోట్ల మార్క్‌ని క్రాస్ చేసేసింది. ఇప్పుడు టాలీవుడ్ కూడా ఆ దిశగా పరుగులు తీయడానికి ముమ్మర ప్రయత్నా చేస్తుంది. ఇప్పటికి దాదాపు 20కోట్ల మార్క్‌ని చేరుకోగలుగుతున్న టాలీవుడ్ సినిమా రానున్న రోజుల్లో మరింతగా పుంజుకుంటుందనేది విశ్లేలషకుల అంచనా. సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా లాభాలు గడించే స్థాయికి ఓవర్‌సీస్ రైట్స్ దాటి పోయాయి.

  అందుకే ఓవర్‌సీస్‌లో కూడా కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను కూడా రుచి చూపిస్తున్నాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు ఆచితూచి అడుగులువేయడం మొదలుపెడుతున్నారు. ఓపెనింగ్ కలెక్షన్ల రూపేణా గట్టిగా ప్రేక్షకులనుండి గుంజేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

  రెండు లేదా మూడు వారాలే హయ్యస్ట్ రన్‌గా కనిపించే ఓవర్‌సీస్ బిజినెస్‌లో మొదటి వారంలోనే 5కోట్ల వరకు వసూళ్ళు రాబట్టే విధంగా బయ్యర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. నెట్ ప్రచారంతో అక్కడి తెలుగు ప్రేక్షకులను... విదేశీయులను ఆకర్షించి మొదటివారం ఫుల్‌బోర్డు పడేలా జాగ్రత్తపడుతున్నారు.

  మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమా 'ఖైదీ నెం. 150' ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.తాజాగా ఇప్పటివరకూ ఉన్న ఓవర్ సీస్ రికార్డ్ లను నే చిరంజీవి తన 'ఖైదీ నెం. 150'బిజినెస్ తో బ్రద్దలు కొట్టి రికార్డ్ క్రియేట్ చేసి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చారు.

  చిరంజీవి పుట్టినరోజును పురస్కరిచుకొని గత నెల్లో విడుదలైన ఫస్ట్‌లుక్‌తో సినిమాపై ఉన్న అంచనాలన్నీ తారాస్థాయికి చేరిపోయాయి. ఇక ఇప్పటికే సగ భాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని టీమ్ ఎప్పుడో ప్రకటించగా, తాజాగా ఇదే విషయాన్ని దర్శకుడు వీవీ వినాయక్ మరోసారి స్పష్టం చేశారు.

  స్లైడ్ షోలో ఈ మధ్యకాలంలో భారీగా ఓవర్ సీస్ రైట్స్ అమ్ముడుపోయిన చిత్రాలు..డిటేల్స్

  మెగాస్టార్ సత్తా

  మెగాస్టార్ సత్తా

  చిరంజీవి భాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చాలా గ్యాప్ తర్వాత చూపించబోతున్న ఈ సమయంలో రికార్డ్ లు బ్రద్దలు అవటం మొదలెట్టాయి. తన మెగా ఎంట్రీ అంటే అసలు ఏ రేంజులో ఉంటుందో మరోసారి ఇండస్ట్రీకి రుచి చూపిస్తున్నారు. ఇప్పుడు ''ఖైదీ నెం 150'' సినిమా అమెరికా రైట్లను ప్రముఖ పంపిణీదారుడు క్లాసిక్ సినిమాస్ వారు.. ఏకంగా 13.5 కోట్లను వెచ్చించి కొన్నట్లు తెలుస్తోంది.

  బాహుబలి

  బాహుబలి

  అప్పట్లో ''బాహుబలి ది బిగినింగ్'' సినిమాను ఏకంగా 9 కోట్లు పెట్టి కొన్నారు.అప్పటికి అదే రికార్డ్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం కావటం, అనుష్క,ప్రభాస్ కాంబినేషన్, అన్నిటిని మించి సినిమాకు ఓవర్ సీస్ లో ఓ రేంజిలో క్రేజ్ రావటం,ట్రైలర్ రిలీజ్ కాగానే అంతా ఆశ్చర్యపోయేలా బిజినెస్ జరగటంతో ఈ రేటుకు అప్పట్లో బాహుబలి చిత్రం అమ్ముడుపోయింది.

  శ్రీమంతుడు

  శ్రీమంతుడు

  మహేష్‌ హీరోగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 8.1 కోట్లకు ఓవర్ సీస్ రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. ఈ రేటు ఆల్ టైమ్ రికార్డు ప్రైస్ గా చెప్తున్నారు. నిర్మాత పార్టనర్ నవీన్...ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మహేష్ కు ఓవర్ సీస్ లో పెరిగిన బిజినెస్ దృష్ట్యా ఈ రేటు పలికినట్లు తెలుస్తోంది.

  సర్దార్ గబ్బర్ సింగ్

  సర్దార్ గబ్బర్ సింగ్

  ఈ మధ్య కాలంలో ఓవర్ సీస్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు 10 కోట్లు..వచ్చాయి. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం కావటం, గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ కు సీక్వెల్ కావటం కలిసి వచ్చింది. అలాగే ఓవర్ సీస్ లో పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు ఉన్నారు. దాంతో మొదటి వారం రోజులు ఆడితే చాలు కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తుందని భావించి ఆ రేటుకు కొన్నారు.

  బ్రహ్మోత్సవం

  బ్రహ్మోత్సవం

  మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ అంటే అంతకు ముందు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం గుర్తుకు వచ్చింది డిస్ట్రిబ్యూటర్స్. దాంతో ఉత్సాహంగా ఈ చిత్రం కొనుగోలు చేయటానికి ముందుకు వచ్చారు. అందుకు తగినట్లే కు 13 కోట్లు కు ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ అమ్ముడుపోయి రికార్డ్ లు క్రియేట్ చేసాయి.

  జనతాగ్యారేజ్

  జనతాగ్యారేజ్

  ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ చిత్రం జనతాగ్యారేజ్ 7.25 కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ రేటుకు పలకటానికి కారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు యుఎస్ లో వీరాభిమానులు ఉన్నారు. అలాగే కొరటాల శివ కు మినిమం గ్యారెంటీ దర్శకుడు అనే పేరు పడింది. దాంతో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.

  ఖైదీ నెంబర్ 150

  ఖైదీ నెంబర్ 150

  చిరంజీవి, వివి వినాయిక్ కాంబినేషన్ అనే కాదు చిరంజీవి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం కావటం కూడా ఈ సినిమాకు క్రేజ్ రావటానికి కారణమైంది. దానికి తోడు తమిళంలో సూపర్ హిట్టైన కత్తి కి రీమేక్ అవటం ఈ సినిమాకు కలిసి వచ్చిన మరో అంశం. వీటిన్నటితో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ కు బాగా పోటీ ఏర్పడింది. దాంతో ఈ చిత్రం వీటన్నింటినీ బీట్ చేస్తూ ఇప్పుడు 13.5 కోట్లకు అమ్ముడుపోయింది.

  బాహుబలి 2

  బాహుబలి 2

  అయితే బాహుబలి 2 ఓవర్ సీస్ రైట్స్ ఎంతకు అమ్మారనే విషయం అయితే బయిటకు రాలేదు. ఆ విషయం బయిటకు వస్తే అదీ రికార్డు ఎమౌంటే ఉంటుంది. ఆ మధ్యన బాహుబలి 2 అన్ని భాషల ఓవర్ సీస్ రైట్స్ ఇస్తే 60 కోట్లు ఇస్తామని దుబాయ్ కి చెందిన ఓ బయ్యర్ ముందుకు వచ్చారని వార్త వినిపించింది. రెగ్యులర్ గా హిందీ సినిమాలను ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసే ఆ బయ్యర్ , తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇలా అన్ని భాషల ఓవర్ సీస్ రైట్స్ కావాలని అడిగారట. అందుకు గాను 60 కోట్ల మొత్తం ఆఫర్ చేసారట.

  మహేష్ -మురగదాస్

  మహేష్ -మురగదాస్

  మహేష్-మురగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం శాటిలైట్ రైట్స్ కు కూడా ఓ రేంజిలో పోటీ ఇప్పటికే ఏర్పడిందని సమాచారం. ఈ మేరకు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేటు చిరంజీవి 150 వ చిత్రం శాటిలైట్ రైట్స్ రేట్ ను బ్రేకే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అంటే అప్పటిదాకానే చిరు రికార్డ్ భధ్రం అన్నమాట.

  శేఖర్ కమ్ములకూ..

  శేఖర్ కమ్ములకూ..

  ఓవర్‌సీస్‌లో మొదట్లో ఫైట్స్ సినిమాలకు ఎక్కువ క్రేజ్‌తోపాటు కాసులు రాలేవి. రానురాను అలాంటి సినిమాల పట్ల అక్కడ వారు విసుగుచెందడంతో ఇప్పుడు అక్కడ కుటుంబ కథా చిత్రాలు... హాస్యంతో కూడిన యాక్షన్ సినిమాలు కలెక్షన్లను బాగా కొల్లగొడుతున్నాయి. అల్లు అర్జున్.. మహేష్‌బాబు.. రవితేజ.. రామ్‌చరణ్... పవన్‌కళ్యాణ్ సినిమాలతోపాటు శేఖర్‌కమ్ముల చిత్రాలకు కూడా మాంఛి క్రేజ్ వుంది.

  హృదయకాలేయం

  హృదయకాలేయం

  ఓవర్‌సీస్ రైట్స్‌లో ఈమధ్య పరిచయమే లేని సంపూర్ణేష్‌బాబు సినిమా ‘హృదయ కాలేయం' మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ‘అల్లరి' నరేష్ సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ వుండడంతో చిన్న సినిమాల హీరోల్లో అల్లరి'నరేష్‌దే ఓవర్‌సీస్ మార్కెట్‌లో పైచేయిగా కనిపిస్తుంది.

  పెళ్లి చూపులు

  పెళ్లి చూపులు

  ఈ మధ్యకాలంలో ఓవర్ సీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన చిన్న చిత్రం పెళ్లి చూపులు . అక్కడ ఎన్నడూ లేని విధంగా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఓవర్ సీస్ లో, మల్టీ ప్లెక్స్ లలో ఈ సినిమా క్లాస్ పీపుల్ కి బాగా ఎక్కింది. డబ్భై ఐదు లక్షల బడ్జెట్ ఖర్చు పెట్టారు నిర్మాతలు. సరాసరి 15 నుంచి 20 కోట్ల వరకూ రావచ్చు అని అంటున్నారు నిర్మాతలు. టేబుల్ ప్రాఫిట్ తో విడుదల అయిన ఈ చిత్రం కనీ వినీ రేంజ్ లో కలక్ట్ చేస్తుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా ఇప్పుడు మరొక సంచలనమైన రికార్డ్ సృష్టించింది .

  English summary
  Already, there has been a tremendous craze for the theatrical rights Khaidi No 150 from all areas including overseas. The latest buzz is that producer Ram Charan has sold off Khaidi No 150's overseas distribution rights for a staggering 13.50 crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X