Don't Miss!
- Sports
ICC Men's T20I Team of the Year 2022: భారత్ నుంచి ముగ్గురే.. రోహిత్‌కు దక్కని చోటు!
- News
Lovers: లవ్ మ్యారేజ్, భర్త బయటకు వెళ్లిన తరువాత ఏం జరిగింది, ఇంట్లో శవమైన భార్యతో ?, మ్యాటర్ !
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Finance
Adani Cement: మూతపడ్డ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలు..! అయోమయంలో 20 వేల కుటుంబాలు..
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Lifestyle
చలికాలంలో అల్లం తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి, ఎందుకో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Pathaan advance bookings: ఎంత కాంట్రవర్సీ అవుతున్నా షారుఖ్ ఖాన్ హవా తగ్గట్లే.. రికార్డు దిశగా బుకింగ్స్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను హీరోగా వెండితెరపై చూసి చాలా కాలం అయింది. ఇక మొత్తానికి అతను ఇప్పుడు పటాన్ సినిమాతో జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హై రేంజ్ లో కొనసాగుతున్నాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ కావడంతో జనాలు టికెట్ల కోసం ఎగబడుతున్నట్లు అనిపిస్తోంది. ఇక బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి భారీ స్థాయిలో అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే పఠాన్ సినిమా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పఠాన్ పై పెరుగుతున్న అంచనాలు
సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో షారుక్ ఖాన్ ఒక స్పై హీరోగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇక ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దీపిక పదుకొనే గ్లామర్ డోస్ తో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక స్పెషల్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఫస్ట్ హైదరాబాద్ లోనే..
హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పఠాన్ సినిమాను మొదటి రోజు మొదటి షో చూడడానికి దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను జనవరి 20వ తేదీ నుంచి ఆన్లైన్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొదట హైదరాబాదులోని ఐమాక్స్ థియేటర్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

బుక్ మై షో క్రాష్..
అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి బుక్ మై షో యాప్ కూడా క్రాష్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బుక్ మై షో టికెట్లు కొనుగోలు చేసేందుకు ఎక్కువ స్థాయిలో జనాలు ఆసక్తి చూపించారు. దీంతో ఆ యాప్ డౌన్ అయిపోయింది. ఇక వెంటనే దాన్ని సవరించిన బుక్ మై షో మళ్లీ మరికొన్ని సిటీలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసింది.

ఒక గంటలోనే కోటి రూపాయలు
హైదరాబాదులోనే కాకుండా బెంగళూరు ఢిల్లీ ముంబై ఇలా ప్రధాన ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక విడుదలైన కొన్ని గంటల్లోనే 29 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. దాదాపు దాని ఆదాయం కోటికి పైగానే ఉన్నట్లు సమాచారం. అటు ఇటుగా చూస్తే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఒక రెండు గంటల్లో దాదాపు రెండు కోట్ల వరకు ఆదాయం చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఆ రికార్డులు బ్రేక్ చేసేలా.
ఇక
పఠాన్
సినిమా
అడ్వాన్స్
బుకింగ్స్
ద్వారానే
సరికొత్త
రికార్డులు
క్రియేట్
చేసే
అవకాశం
ఉన్నట్లు
అనిపిస్తోంది.
ఇంతకుముందు
బ్రహ్మాస్త్ర
సినిమా
అడ్వాన్స్
బుకింగ్స్
ద్వారా
దాదాపు
17.1
కోట్ల
వరకు
కలెక్షన్స్
సొంతం
చేసుకుంది.
దాని
తర్వాత
వార్
సినిమా
32
కోట్లకు
పైగా
అడ్వాన్స్
బుకింగ్
ద్వారా
కలెక్షన్స్
అందుకుంది.
ఇక
ఈ
రికార్డులను
షారుఖ్
పఠాన్
సినిమాతో
ఈజీగా
క్రాస్
చేసి
అవకాశమైతే
ఉంది.

హిందీలో భారీ ఒపెనింగ్స్
ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ లో కూడా పఠాన్ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటి రోజు ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో లిస్టును కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. గత ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి రోజు హిందీలో 80 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు పఠాన్ సినిమా ఆ రికార్డ్ ను కూడా బ్రేక్ చేయవచ్చు అని టాక్ అయితే వినిపిస్తోంది.