Don't Miss!
- News
Vastu tips: ఇంటికెళితే చిరాకులా.. అన్నీ సమస్యలా.. బయటపడేందుకు చెయ్యాల్సిందిదే!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pathan Box Office Prediction: ఇదేమి ఊచకోత బాబోయ్.. జెట్ స్పీడ్ లో 200 కోట్లు?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కొట్టి చాలా కాలం అయింది. 2018లో చివరగా జీరో సినిమాతో వచ్చిన ఈ స్టార్ హీరో ఆ తర్వాత సోలో హీరోగా మరో సినిమాతో అయితే ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అతను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన పఠాన్ సినిమా జనవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక మొదటి రోజు ఈ సినిమా ఇంత కలెక్ట్ చేయవచ్చు.. అనే వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో సాలీడ్ బుకింగ్స్
పఠాన్ సినిమా దేశవ్యాప్తంగా కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్ నగరంలో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ వినిపిస్తోంది. అన్ని ఏరియాల కంటే ముందుగానే హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక సినిమా ఇప్పటివరకు హైదరాబాద్ లోనే రెండు కోట్ల మార్క్ ను అందుకోవడం విశేషం. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నైజాంలో పెరుగుతున్న కలెక్షన్స్
ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద సినిమాల కంటే ఎక్కువ స్థాయిలోనే పఠాన్ సినిమా అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమా విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్నప్పటికీ హై రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి.

అత్యధికంగా అమ్ముడవుతున్న టిక్కెట్లు
ఇక పఠాన్ సినిమా టాప్ 3 అడ్వాన్స్ బుకింగ్ నేషనల్ చైన్ వైస్ గా చూసుకుంటే మాత్రం అత్యధిక స్థాయిలో టికెట్లు అమ్ముడైన సినిమాగా నిలిచే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటి రోజు ఈ రికార్డులో ఇప్పటివరకు కేజిఎఫ్ సెకండ్ పార్ట్ కు 5.15 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక తర్వాత బ్రహ్మాస్త్రకు 3.02 లక్షల టికెట్లు అమ్ముడవగా అది రెండో స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు పటాన్ సినిమా 2.65 లక్షల టికెట్లను అమ్ముకుంది. ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.

మొదట రోజు ఎంత?
షారుఖ్ అసలే ఫ్లాప్ లో ఉన్నాడు. ఈసారి సక్సెస్ అవ్వడం చాలా కష్టం అనే కామెంట్స్ వస్తున్న తరుణంలో ఈ తరహాలో అడ్వాన్స్ బుకింగ్ నమోదవడం అనేది ఆశ్చర్యం అని చెప్పాలి. ఇక మొత్తంగా ఓపెనింగ్స్ లో అయితే ఈ సినిమాకు 40 నుంచి 50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గురువారం రోజు 50 నుంచి 52 కోట్లు కూడా రావచ్చు.

జెట్ స్పీడ్ లో 200 కోట్లు?
ఇక మొత్తంగా వీకెండ్ మొత్తంలో ఈ సినిమా 180 నుంచి 200 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. అయితే కేవలం పాజిటివ్ టాక్ వస్తేనే ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సినిమా చాలా తొందరగా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. షారుక్ ఖాన్ ఫస్ట్ రెండు రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.