»   » ఓవర్ సీస్ కలెక్షన్స్ బాగున్నాయి..ఇక్కడ డల్

ఓవర్ సీస్ కలెక్షన్స్ బాగున్నాయి..ఇక్కడ డల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఓవర్ సీస్ మార్కెట్లలో షారుఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన దిల్‌వాలే చిత్రం భారీ కలెక్షన్లుతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన కలెక్షన్ల వివరాల ప్రకారం విదేశాల్లో దిల్‌వాలే రూ. 149.80 కోట్లు. ఇక బాజీరావు కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే ఈ చిత్రం విదేశాల్లో రూ. 90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. జనవరి 8 వరకు పెద్ద చిత్రాలు లేక పోవడంతో ఈ చిత్రాల కలెక్షన్ల మరింత పెరిగే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు.

వాస్తవానికి ట్రేడ్ లో లెక్కల ప్రకారం దిల్‌వాలే చిత్రం సంవత్సరాంతపు కలెక్షన్లలో ఢీలా పడిపోయింది. ఆరంభంలో భారీ కలెక్షన్లతో 2015లో తొలి రోజు వసూళ్లలో మూడో స్థానం సంపాదించిన దిల్‌వాలే రెండో వారం పూర్తిగా ఢీలా పడిపోయింది. తొలివారంలో దేశీయంగా దాదాపు రూ. 102.65 కోట్లు వసూలు చేసిన ఈ సూపర్‌ హిట్‌ దిల్‌వాలే జోడి రెండో వారంలో మరాఠా యోధడు బాజీరావు దెబ్బకి పూర్తిగా ఢీలా పడిపోయి రూ. 31.22 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 Shah Rukh Khan’s Dilwale Has Massive Collections Overseas!

మరాఠా యోధుడు బాజీరావు పీష్వా జీవితం ఆధారంగా తెరకెక్కిన బాజీరావు మస్తానీ చిత్రం ఆరంభంలో తడబడినా.. తొందరలోనే కోలుకుని భారీ వసూళ్లు సాధించింది. దేశీయంగా తొలి రోజు రూ.12.80 కోట్ల మాత్రమే వసూలు చేసిన బాజీరావు విమర్శకుల ప్రశంసలు, మంచి రివ్యూలతో క్రమంగా పుజుకుని దేశీయ కలెక్షన్లలో భారీ ఓపెనింగ్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న దిల్‌వాలే చిత్రానికి గట్టిపోటీ ఇచ్చింది. ఇప్పటి వరకు వసూలైన దేశీయ కలెక్షన్ల మొత్తం దాదాపు రూ. 162.35 కోట్లు. ఇది దిల్‌వాలే కంటే దాదాపు రూ. 20 కోట్లు ఎక్కువ కావడం విశేషం.

ఇప్పటికి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.211కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఓవర్సీస్‌లో 90కోట్ల మార్కును చేరినట్లు ఎరాస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

English summary
Shah Rukh-Kajol-starrer's domestic run has slowed drastically. The film is earning in the range of Rs 2-3 crore in its third week from Indian markets. The 17-day net domestic earnings of "Dilwale" stands at Rs 142.92 crore, while the gross income is Rs 204.17 crore.
Please Wait while comments are loading...