Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
భారీగా 2.0 అడ్వాన్స్ బుకింగ్.. బాహుబలి2 రికార్డుపై గురి.. ఇక బాక్సాఫీస్ షేకే..
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 2.0 చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభింంచాయి. బుధవారం మధ్యాహ్నం వరకు దాదాపు భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్టు తెలిసింది. భారీ ఓపెనింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 2.0 చిత్రం నవంబర్ 29న రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో 915 షోలతో
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 2.0 చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్‌లో 174 స్క్రీన్లలో 915 షోలను ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగా రిలీజ్ అవుతున్నది. దీంతో ఓపెనింగ్ రోజునే తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.

అడ్వాన్స్ బుకింగ్‌కు విశేష స్పందన
బుధవారం మధ్యాహ్నమే 12 గంటల సమయంలో 2.0 చిత్ర అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. టికెట్ కౌంటర్లు తెరిచిన కొద్ది సేపటికే సుమారు 300 షోలకు టికెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు వెర్షన్‌కు విశేష స్పందన లభిస్తున్నదనే విషయం ఆన్ లైన్ టికెటింగ్ వెబ్‌సైట్ల ద్వారా వెల్లడైంది.
2.0 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రజనీ స్టయిల్ సూపర్, అక్షయ్ నటన హైలెట్.. భారత్‌కే గర్వంగా..

తొలిరోజున రూ.7 కోట్లు
అడ్వాన్స్ బుకింగ్ సరళిని చూస్తే హైదరాబాద్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. కేవలం హైదరాబాద్‌లోనే రూ.7 కోట్ల వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాహుబలి2 రికార్డు బీట్ చేసే దిశగా 2.0 చిత్రం అడుగులు వేస్తున్నది.

దేశవ్యాప్తంగా 10 లక్షల టికెట్లు
ఇక 2.0 సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రభంజనం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇప్పటికే 10 లక్షల టికెట్లు బుక్ మై షో వెబ్‌సైట్‌లో అమ్ముడైనట్టు సమాచారం. తొలి ఆట పడేసరికి అడ్వాన్స్ బుకింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.