»   »  ‘శంకరాభరణం’ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి?

‘శంకరాభరణం’ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిఖిల్, నందిత హీరో హీరోయిన్లుగా ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్క్రీప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు కూడా చేపట్టి చివరకు తానే నిర్మాతగా మారి విడుదల చేసిన చిత్రం ‘శంకరాభరణం'. డిసెంబర్ 4 విడుదలైన ఈ చిత్రం తొలి రోజు మిక్డ్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 10 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. తొలి రెండురోజుల్లో కంటే ఆదివారం కలెక్షన్ల స్ట్రాంగ్ గా ఉన్నాయని అంటున్నారు. సినిమాలోని కొన్ని అనవసర సీన్ల వల్లనే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారని భావించిన నిర్మాతలు సినిమాను మరింత షార్ప్ గా ట్రిమ్ చేయాలని నిర్ణయించారు. సినిమాను 12 నిమిషాల నిడివిని ట్రిమ్ చేస్తున్నారు.

సినిమాలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమే అని హీరో నిఖిల్ ట్విట్టర్ ద్వారా ఒప్పుకున్నారు. అయితే టార్గెట్ ఆయడిన్స్ సినిమా చాలా ఎంటర్టెనింగ్ గటా ఉందని అంటున్నారు. నా కెరీర్లోనే ఈ సినిమాకు హయ్యెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్ అని ట్వీట్ చేసారు.

Shankarabharanam 3 days collections

మిమ్మల్ని మెప్పించడానికి, మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇందుకోసం నా వల్ల అయినంత హార్డ్ వర్క్ చేసారు. మరిన్ని విభిన్నమైన సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అని నిఖిల్ ట్వీట్ చేసారు. మీ ఆశీర్వాదలు నాకు ఎప్పటికీ ఉండాలనికోరుకుంటున్నట్లు నిఖిల్ పేర్కొన్నాడు.

ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, నిర్మాత: ఎంవివి సత్యనారాయణ. కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, దర్శకత్వం: ఉదయ్ నందనవనం.

English summary
Nikhil’s Shankarabharanam opened to some mixed talk last Friday. According to the latest update, the crime comedy has collected a total gross of over 10 crores till date.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu