»   » ‘బ్రూస్ లీ’ తో పాటే వస్తున్న నిఖిల్

‘బ్రూస్ లీ’ తో పాటే వస్తున్న నిఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం ‘బ్రూస్ లీ'. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ' సర్టిఫికేట్ అందుకున్న బ్రూస్ లీ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంకు శంకరాభరణం ట్రైలర్ ని ఎటాచ్ చేసి వదులుతున్నారు. కోన వెంకట్ ...బ్రూస్ లీ చిత్రానికి రచన చేయటం, అలాగే అదే కోన వెంకట్...శంకరాభరణం చిత్రానికి నిర్మాత కావటంతో ఇలా వర్కవుట్ అయ్యింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక నిఖిల్‌, నందిత జంటగా నటిస్తున్న చిత్రం 'శంకరాభరణం'. ఉదయ్‌ నందనవనమ్‌ దర్శకుడు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో 'సర్దార్‌ - గబ్బర్‌సింగ్‌'సెట్లో.. 'శంకరాభరణం' ప్రచార చిత్రాన్ని పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


''నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. ఆయన చేతులు మీదుగా 'శంకరాభరణం' ప్రచార చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉంద''న్నాడు నిఖిల్‌. ''శంకరాభరణం' వినోదాత్మక చిత్రాల్లో ఓ మైలురాయిగా నిలుస్తుంద''న్నారు చిత్ర సమర్పకుడు కోన వెంకట్‌. దర్శకుడు మాట్లాడుతూ ''చిత్రీకరణ పూర్తయింది. దీపావళికి విడుదల చేస్తాము''అన్నారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.స్వామి రా రా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్‌ సూర్య'... ఇలా వరుస విజయాలు అందించిన ఉత్సాహంలో ఉన్నాడు నిఖిల్‌. ఇప్పుడు 'శంకరాభరణం' అనే మరో వినూత్న కథతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌ నందనవనమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.


ఈ చిత్రంలో హీరోయిన్ గా నందితను చేస్తోంది. ఓ ప్రత్యేక పాత్రలో అంజలి నటించనుంది. క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సాగే కథ ఇది. సంపత్‌రాజ్‌, బ్రహ్మానందం, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన కోన వెంకట్‌ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. స్కై హై ఫిల్మ్స్ వారు నా శంకరాభరణం చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆడియన్స్ కు మేము మంచి ప్రొడక్ట్ ని ఇస్తామని ఆశిస్తున్నాము అన్నారు.


ShankaraBharanam‬ Trailer attached to ‪ ‎BruceLee

నిఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో స్టైలిష్ గా ఉంటాయంటున్నారు. అమెరికాలో విలాసవంతమైన జీవితం అనుభవించే కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో ఇండియా వచ్చి బీహార్లో చిక్కుకోవడం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందట. దీంతో రీసెంట్ గా ఓ షెడ్యూల్ ను బీహార్ లోనూ పూర్తి చేశారు. మరి డిఫరెంట్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్న నిఖిల్ ఖాతాలో... ఈ శంకరాభరణం కూడా మరో విజయంగా నిలుస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
Nikhil' ShankaraBharanam‬ Trailer attached to ‪ ‎BruceLeeTheFighter‬ Prints Worldwide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu