»   » క్రేజ్ ని క్యాష్ : ఆగిన సినిమా టైటిల్ మార్చేసి, రిలీజ్

క్రేజ్ ని క్యాష్ : ఆగిన సినిమా టైటిల్ మార్చేసి, రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ ఉన్నా కొన్ని సినిమాలు రకరకాల కారణాలతో రిలీజ్ లు కాకుండా ఆగిపోతూంటాయి. అప్పట్లో శర్వానంద్, నిత్యామీనన్ కాంబినేషన్ లో చేరన్ దర్శకత్వంలో ఓ చిత్రం పూర్తై, రిలీజ్ కు నోచుకోని విషయం గుర్తుండే ఉంటుంది.

'ఏమిటో ఈ మాయ' టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం స్రవంతి రవికిషోర్ వంటి పెద్ద నిర్మాత వెనక ఉండి కూడా రిలీజ్ కాక అలా మిగిలిపోయింది. కాని దాన్ని ఇప్పుడు బయిటకు తీసి రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మార్చి మూడవ వారంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తారు.

తమిళంలో ఆల్రెడీ విడుదల చేసిన ఈ సినిమాను తెలుగులో టైటిల్ మార్చి విడుదల చేస్తున్నారు. ‘రాజాధిరాజా' టైటిల్ తో విడుదల కానున్న ఈ చిత్రం రైట్స్ ని స్రవంతి రవికిషోర్ నుంచి ఎన్ వెంకటేష్ అనే నిర్మాత తీసుకుని తమ బృదావన్ పిక్చర్స్ బ్యానర్ పై రిలీజ్ చేయబోతున్నారు.

Sharwanand 'Yemito Ee Maaya' releasing now

ఆల్రెడీ మొన్న సంక్రాంతికి ఎక్సప్రెస్ రాజా టైటిల్ తో శర్వానంద్ చిత్రం వచ్చి హిట్ అవటంతో ...ఈ కొత్త టైటిల్ తో ఖచ్చితంగా ఓపినింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోని మార్చి రెండవ వారంలో విడుదల చేయనున్నారు. అదీ సంగతి.

చిత్ర నిర్మాత ఎన్.వెంకటేష్ మాట్లాడుతూ '' రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా సక్సెస్ లతో హ్యాట్రిక్ హీరో అయిన శర్వానంద్ ఇప్పుడు 'రాజాధిరాజా' చిత్రంతో సెకండ్ హాట్రిక్ స్టార్ట్ చేస్తాడు.

మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శర్వానంద్, నిత్యామీనన్ ల జోడి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది. లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో లవ్, ఎమోషన్స్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటాయి.

తెలుగులో విజయవంతమైన నా ఆటోగ్రాఫ్ తమిళ మాతృకను తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ చేరన్ ప్రతి సన్నివేశాన్ని బ్యూటీఫుల్ గా తెరకెక్కించారు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

తెలుగు నుండి తమిళంలో సినిమాను అనువదించి, తెలుగు, తమిళంలో సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మార్చి రెండో వారంలో జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల చేసి మార్చి మూడోవారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

శర్వానంద్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: జి.వి.ప్రకాష్ కుమార్, , కెమెరా: సిద్ధార్థ్, డైలాగ్స్: రమణ మాలెం, ఎడిటర్: జి.రామారావు, సాహిత్యం: అనంత్ శ్రీరాం, ఆర్ట్: రాజీవన్, జి.సెల్వకుమార్, సహ నిర్మాత: పి.శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.సాయికృష్ణ, నిర్మాత: ఎన్.వెంకటేష్, దర్శకత్వం: చేరన్.

English summary
Sharwanand's 'Yemito Ee Maaya' makers have changed the film title as ‘Rajadhi Raja’ . N.Venkatesh is now the producer of the film on his Brindavan Pictures Banner. GV Prakash Kumar is the music director and the album will release in the second week..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu