»   »  రవితేజ కెరీర్ మొత్తంలో ఇలా ఎప్పుడూ జరగలేదు, ఇదే తొలిసారి

రవితేజ కెరీర్ మొత్తంలో ఇలా ఎప్పుడూ జరగలేదు, ఇదే తొలిసారి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోగా రవితేజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా సినిమా చేయకుండా లేడు. ఆయన సినిమా విడుదల కాని సంవత్సరం లేదు. అయితే తొలిసారిగా 2016 లో ఆయన చిత్రం ఒక్కటీ కూడా రిలీజ్ అయ్యే వాతావరణం కనపడటం లేదు. గతంలో వరసపెట్టి ఏడాదికి రెండు నుంచి మూడు చిత్రాలు చేసిన రవితేజ ఈ సంవత్సరం ఒక్కటి కూడా రిలీజ్ చేయలేని సిట్యువేషన్ లో పడటం ఆయన అభిమానులను బాధపెడుతోంది.

వాస్తవానికి ఈ సంవత్సరం ఎవడో ఒకడు టైటిల్ తో దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ చిత్రం చేసి ఈ సంవత్సరం రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ నిర్మాతకు, హీరోకు మధ్య వచ్చిన డిఫెరెన్సెన్స్ లతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

Shock: It's first for Ravi Teja!

ఆ తర్వాత కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రం పట్టాలు ఎక్కుతుందని ప్రకటన వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ సినిమా ప్రారంభం అవుతుందనుకున్నారు. కానీ జూలైలోకి వచ్చినా ఇంకా షూటింగే ప్రారంభం కాలేదు.

అలాగే ఇప్పుడు రవితేజ..సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబితోనూ,రమేష్ వర్మతోనూ రెండు ప్రాజెక్టులకు కథలు ఓకే చేసారు. వచ్చే నెలలో వీటిలో ఏదైనా ప్రారంభమైనా ఈ సంవత్సరం అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ అవటం కష్టమే. వచ్చే సంవత్సరం దాకా ఆగాల్సిందే. అంటే ఈ సంవత్సరం ఒక్క రిలీజ్ కూడా రవితేజ సినిమా లేదన్నమాట. ఇలా రవితేజ కెరీర్ లో జరగటం ఇదే తొలిసారి అంటున్నారు.

English summary
This year, Ravi Teja will be missing totally as none of his movie would be hitting screens in 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu