»   » సిద్దార్ద సినిమాని మాటీవి కొనుక్కుంది

సిద్దార్ద సినిమాని మాటీవి కొనుక్కుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సిద్దార్ద హీరోగా వచ్చి తమిళంలో విజయవంతమైన ‘ఎనకుల్ ఒరువన్' చిత్రాన్ని తెలుగులో ‘నాలో ఒకడు'గా అందిస్తున్నారు. సిద్ధార్థ్, దీపసన్నిధి జంటగా ప్రసాద్ రమర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు రూపొందాయి. మరో ప్రక్క ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడయినట్లు సమాచారం. మా టీవి వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 75 లక్షలు వెచ్చించి తీసుకున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నిర్మాత ప్రకృతి మాట్లాడుతూ..... మంచి సినిమాను అందించాలన్న తపనతో సిద్ధార్థ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకువస్తున్నాం. తమిళంలో మంచి విజయం సాధించి, కలక్షన్లు ఆర్జించింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. 


Siddharth's Naalo Okadu satellite rights sold

సిద్ధార్థ మాట్లాడుతూ.... రొటీన్ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా నవ్యమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నా పాత్ర తీరుతెన్నులు వైవిధ్యంగా వుంటాయి. నాకు తెలుగు చిత్రసీమతోనే అనుబంధం ఎక్కువగా వుంది. నేను ఇప్పటివరకు చేసిన 25 సినిమాల్లో 12 తెలుగు చిత్రాలే. బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రాల తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమాలు చేయలేకపోయాను. వచ్చే ఏడాది తెలుగులో రెండు పెద్ద చిత్రాల్ని చేయబోతున్నాను అన్నారు.


వినూత్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని, తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిదని దర్శకుడు ప్రసాద్ రమర్ తెలిపారు. ఉదయ్‌మహేష్, అజయ్త్న్రం, యోగి, మహదేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌నారాయణ్, నిర్మాత: ప్రకృతి, దర్శకత్వం: ప్రసాద్ రమర్.

English summary
Siddharth, Deepa Sannidhi's Ennakul Oruvan is releasing in Telugu as Naalo Okadu. the film's satellite rights are bagged by MAA TV for 75 lakhs.
Please Wait while comments are loading...