»   » సంపూను నమ్ముకున్నారు: ‘సింగం 123’ రిజల్టేంటి?

సంపూను నమ్ముకున్నారు: ‘సింగం 123’ రిజల్టేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హృద‌య‌కాలేయం సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. మనోజ్, అల్లరి నరేష్ లాంటి హీరోలు తమ సినిమాల్లో సంపూకు ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి అతనికి హైప్ పెంచారు. తాజాగా సంపూర్ణేష్ బాబు నటించిన ‘సింగం 123' విడుదలైంది.

మంచు విష్ణు నిర్మించడంతో సినిమాపై ముందు నుండీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈచిత్రం గ్రాండ్ గా విడుదల చేసాడు మంచు విష్ణు. థియేటర్లతో పాటు ఆన్ లైన్లో కూడా రీలీజ్ చేసారు. రూ. కోటి బడ్జెట్ లో సినిమా తీసిన విష్ణు వివిధ ఏరియాలన్నీ కలిపి రెట్టింపు లాభానికి అమ్మినట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్, ఇతర రైట్స్ అన్నీ కలిపి విష్ణు రూ. కోటి పెట్టుబడికి రూ. 4 కోట్లు రాబట్టుకున్నట్లు చెబుతున్నారు.


Singam 123 collection

సినిమా విడుదలైన తొలి రోజే ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సంపూర్ణేష్ బాబు సినిమాలకు ముందు నుండి ప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో వీకెండ్ వరకు థియేటర్లకు జనం, ముఖ్యంగా యూత్ క్యూ కట్టారు. దీంతో అటు నిర్మాత విష్ణుతో పాటు సినిమాను కొన్న బయ్యర్లు కూడా నష్ట పోకుండా బయట పడ్డట్లు టాక్.


సినిమా బడ్జెట్ తక్కువగా ఉండటం.... సంపూ రేంజి హీరోకు ఊహించనన్ని థియేటర్లు దొరకడం ప్లస్సయింది. మొత్తానికి సంపూర్ణేష్ బాబుపై మీద ముందు నుండీ క్రియేటైన ఎక్స్‌పెక్టేషన్సే సినిమా ఓపెనింగ్స్ రూపంలో బయ్యర్లను గట్టెక్కించాయని అంటున్నారు.

English summary
Singham 123 is a spoof action comedy starring Sampoornesh Babu playing the role of a Sensational Seductive Supercop.
Please Wait while comments are loading...