»   » మంచు విష్ణు మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయ్యింది

మంచు విష్ణు మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నటుడుగా,నిర్మాతగా కొనసాగుతున్న మంచు విష్ణు కెరీర్ లో ఈ మధ్య కాలంలో సరైన హిట్ రాలేదు. అయితే ఈ సారి రూట్ మార్చి తన కుటుంబం హీరోలతో కాకుండా బయిట నుంచి సంపూర్ణేష్ బాబుని తీసుకువచ్చి అతను హీరోగా చిత్రం రూపొందించారు. సింగం 123 తో రూపొందిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డ్ లతో దర్శనమిచ్చింది.

లో బడ్జెట్ లో కొత్త దర్శకుడుతో, చిన్న హీరోతో చేసిన ఈ ప్రయోగం సఫలీకృతమైంది. రిలీజ్ కు ముందే ఈ చిత్రం టేబుల్ ప్రాఫిట్స్ సం.పాదించిందని సమాచారం. అంతేకాదు కొనుక్కున్న బయ్యర్లు అంతా రికవరీ బాగుండటంతో అంతా హ్యాపీగా ఉన్నారు. దాంతో ఇప్పుడు వరసగా చిన్న సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ మొత్తం ఈ విషయమై పండుగ చేసుకుంటోంది.


మంచు విష్ణు తాజా చిత్రం విషయానికి వస్తే...


Singam 123: Manchu Vishnu's Idea Works

మంచు విష్ణు హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డైనమేట్. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ చిత్రం అరిమనంబి ఆధారం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఓ రేంజిలో పేలింది.


మంచు విష్ణు మాట్లాడుతూ .....డైనమేట్ లాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. కథకు తగ్గ టైటిల్ కుదిరింది. కథ డిమాండ్ మేరకు కొత్త లుక్ కోసం పాత్ర పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో నా పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు కొత్తగా వుంటాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ... ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాంఅన్నారు.


మంచు విష్ణు హీరోగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2014లో పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు చిత్రాల్లో నటించిన ఈ డైనమిక్ హీరో ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ లుక్, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు.ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘అరిమ నంబి' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది.


Singam 123: Manchu Vishnu's Idea Works

ఆ మధ్యన ఈ సినిమాకి సంబంధించి హీరో విష్ణు లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో విష్ణు డిఫరెంట్ గా చెవిపోగులతో కనిపించనున్నాడు. హీరో కొత్త లుక్ లో కనబడితే బావుంటుందని భావించిన డైరెక్టర్ దేవాకట్టా తన ఆలోచనని విష్ణుకి తెలియజేయడం, సినిమాల్లో తన పాత్ర, లుక్ పరంగా భిన్నంగా కనబడాలనుకునే హీరో మంచు విష్ణు దానికి సరేననడం జరిగింది.


విష్ణు పోషిస్తున్న పాత్ర, ఆయన అభినయం, ఆహార్యానికి తగినట్లుగానే ‘డైనమైట్‌' టైటిల్‌ను నిర్ణయించినట్లు దేవా కట్టా చెప్పారు. ‘‘చెవిపోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్‌ లుక్‌తో విష్ణు కనువిందు చేయనున్నారు. ఇందులో యాక్షన్‌ సన్నివేశాల కోసం ఆయన స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. ప్రేక్షకులు, అభిమానులను అలరించే విధంగా ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నాం'' అని తెలిపారు.

English summary
Actor-producer Vishnu Manchu is delighted with the stupendous success of Singham 123.
Please Wait while comments are loading...