»   » రజనీకి దీటుగా సూర్య.. రిలీజ్‌కు ముందే సింగం-3కి 100 కోట్లు!..

రజనీకి దీటుగా సూర్య.. రిలీజ్‌కు ముందే సింగం-3కి 100 కోట్లు!..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వాయిదాల మీద వాయిదా పడుతున్న సింగం-3 చిత్రం విడుదలకు ముందే రూ.100 కోట్ల జాబితాలో చేరింది. 20 ఏండ్ల కెరీర్‌లో సూర్య చిత్రానికి ఈ రేంజ్‌లో బిజినెస్ కావడం ఓ రికార్డు.

తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ క్రెడిట్ దక్కించుకొన్న హీరోగా సూర్య ఓ ఘనతను సంతం చేసుకొన్నారు.

సింగం-3 చిత్ర విడుదలను పురస్కరించుకొని హీరో సూర్య, నిర్మాత, పంపిణీదారు జ్హానవేల్ రాజా, దర్శకుడు హరి ఆదివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చిత్రం పలుమార్లు వాయిదా పడటంపై స్పందిస్తూ సూర్య అభిమానులకు క్షమాపణలు తెలిపారు.

Singam-3 already collects 100 crores!

ఈ సందర్భంగా నిర్మాత రాజా మాట్లాడుతూ సింగం-3 విడుదలకు ముందే రూ.100 కోట్లు విడుదల చేసిందని, డిస్ట్రిబ్యూటర్లందరూ చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. కోలివుడ్‌లో రజనీకాంత్ తర్వాత అతిపెద్ద మార్కెట్ ఉన్న హీరోగా సూర్య స్టామినా రుజువు చేసిందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 9వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో సూర్యకు జంటగా అనుష్కశెట్టి, శృతిహాసన్ నటిస్తున్నారు.

English summary
singham 3 has already collected INR 100 crores, and has made the distributors happy much before its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu