»   » సూర్య ‘సింగం-3’: డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత డిమాండ్?

సూర్య ‘సింగం-3’: డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత డిమాండ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా, శృతి హ‌స‌న్‌, అనుష్క‌ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం సింగం2. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలో వచ్చిన సింగం రెండు సిరీస్ లు భారీ విజయం సాధించాయి. ఇప్ప‌డు ఆదే సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించగా.... తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత‌ మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ 16నే విడుదలవ్వాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ మూవీ 'ధృవ' మంచి టాక్‌తో దూసుకెలుతుండటంతో నిర్మాత అల్లు అరవింద్ కోరిక మేరకు సింగం-3 చిత్రాన్ని డిసెంబర్ 23కు వాయిదా వేసారు.

అయితే ఇపుడు డిసెంబర్ 23న కూడా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అందుకు కారణం జయలలిత మరణానికి తోడు, ఇటీవల తమిళనాడులో వర్దా తుఫాన్ సృష్టించిన బీభత్సం కూడా ఓ కారణం. ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే నష్టాలు తప్పవని భావిస్తున్న జ్ఞానవేల్ రాజా.... జనవరి 26కు వాయిదా వేయాలని ప్లాన్ చేస్తున్నారట.

డబ్బు తిరివ్వాలని డిమాండ్

డబ్బు తిరివ్వాలని డిమాండ్

అయితే జనవరి 26న అయితే తనకు తెలుగులో రిలీజ్ చేయడం కష్టం అవుతుందని, అలాంటి పరిస్థితుల్లో తనకు నష్టం వాటిల్లుతుందని, తన డబ్బు తిరిగి ఇవ్వాలని మల్కాపురం శివకుమార్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

రూ. 18 కోట్లకు రైట్స్

రూ. 18 కోట్లకు రైట్స్

‘సింగం-3' తెలుగు హక్కులను మల్కాపురం శివకుమార్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చాడు. అడ్వాన్సుగా ఇచ్చిన తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడట.

శృతి హాసన్, అనుష్క మైండ్ బ్లోయింగ్ లుక్ (సింగం-3 ఫోటోస్)

శృతి హాసన్, అనుష్క మైండ్ బ్లోయింగ్ లుక్ (సింగం-3 ఫోటోస్)

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

సినిమా హీరోలు స్టార్ హీరో హోదా వచ్చిన తర్వాత జన సమ్మర్ధ ప్రదేశాల్లోకి రావడానికి దాదాపుగా ఇష్ట పడరు. మరి అలాంటిది భార్యకు బైక్ రైడింగ్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Film Nagar source said that, Suriya and Gnanavel planning to postpone the ‘Singam 3' to Jan 26th owing to the prevailing conditions in Tamil Nadu, Siva Kumar wants his money back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu