»   » సూపర్ కలెక్షన్స్: మూడు రోజుల్లో రూ. 54 కోట్లు

సూపర్ కలెక్షన్స్: మూడు రోజుల్లో రూ. 54 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్షయ్ కుమార్ నటించిన యాక్షన్ కామెడీ మూవీ ‘సింగ్ ఈజ్ బ్లింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబడుతోంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును అందుకోవడం గమనార్హం. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 54.44 కోట్లు వసూలు చేసింది.

తొలి రోజు ఈ చిత్రం రూ. 20.67 కోట్లు రాబట్టింది. రెండో రోజైన శనివారం వసూళ్లు కాస్త తగ్గడంతో రూ. 14.50 కోట్లు వచ్చాయి. సెలవురోజైన ఆదివారం మళ్లీ పుంచుకుని రూ. 19.27 కోట్లు వసూలు చేసింది. తొలి మూడు రోజుల్లో టోటల్ కలెక్షన్స్ రూ. 54.44 కోట్లకు చేరుకుంది. అక్షయ్ కుమార్ కెరీర్లో హయ్యెస్ట్ వీకెండ్ వసూళ్లు సాధించిన చిత్రంగా సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం నిలిచింది.

‘Singh is Bliing’ earns Rs.54.44 crore in three days

గతంలో అక్షయ్ కుమార్, ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన రౌడీ రాథోడ్ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

‘సింగ్ ఈజ్ బ్లింగ్' చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు అమీ జాక్షన్, లారా దత్తా, కేకే మీనన్ ముఖ్య పాత్ర పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల వసూళ్లను అందుకుంటుందని భావిస్తున్నారు.

English summary
Actor Akshay Kumar’s highly anticipated action comedy film “Singh is Bliing” is receiving an enormous response at the box office. The Prabhudheva directorial has surpassed the Rs.50 crore mark in just three days since its release on Friday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu