»   » కాజల్ 'సింగం' కలెక్షన్స్ రిపోర్టు

కాజల్ 'సింగం' కలెక్షన్స్ రిపోర్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాజల్, అజయ్ దేవగన్ కాంబినేషన్ లో రూపొందిన సింగం చిత్రం మంచి ఓపినింగ్స్ తో మొదలైంది. ఈ యాక్షన్ ధ్రిల్లర్ ఈ వారాంతంలో మంచి బిజెనెస్ ని జనరేట్ చేసి నిర్మాతని, ఎగ్జిబిటర్స్ ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు నలభై రెండు కోట్ల రెండు లక్షల రూపాయల వరకూ గ్రాస్ ఇండియాలో కలెక్టు చేయగా, ఓవర్ సీస్ లో మూడు కోట్ల యాభై లక్షలు వసూలు చేసింది. గోల్ మాల్ సిరీస్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ వారు రూపొందించారు. తమిళంలోనూ, తెలుగులోనూ హిట్టయిన యముడు చిత్రం రీమేక్ ఇది. ఈ మధ్యకాలంలో వచ్చిన వీకెండ్ హైయిస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రాన్ని బాలీవుడ్ ట్రేడ్ లో వర్ణిస్తున్నారు. ఈ చిత్రం ముప్పై ఎనిమిది దేశాల్లో విడుదల అయ్యింది. ఆ తర్వా సెకెండ్ ఫేజ్ లో ధియోటర్స్ ని పెంచే యోచనలో నిర్మాతలు ఉన్నారు. ఈ విషయమై రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవో సంజయ్ లామ్బా మాట్లాడుతూ..అద్బుతమైన ఓపినింగ్స్ తో సినిమా మొదలైంది. ఇలాగే కలెక్షన్స్ కంటిన్యూ అయి రికార్డు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నాం అన్నారు.

English summary
After an impressive opening, Ajay Devgan starrer action thriller ‘Singham’ generated good business during the weekend as well and grossed Rs.44.2 crore in domestic market and Rs.3.50 crore overseas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu