»   » తెలుగే కాదు హిందీ శాటిలైట్ అమ్మేసారు

తెలుగే కాదు హిందీ శాటిలైట్ అమ్మేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు లో హిట్టైన సినిమాలను డబ్బింగ్ చేసి హిందీ ఛానెల్స్ లో వేయిటం సహజమే. అక్కడ మంచి మార్కెట్ ఉంది. టీఆర్పీలు బాగా వస్తూండటంతో సౌత్ లో రిలీజ్ అవుతున్న సినిమాలపై అందుకే రిలీజ్ ముందే కర్ఛీప్ లు వేసి సొంతం చేసుకుంటున్నారు. తాగాజా సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాపై వీరి దృష్టి పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...నాగార్జున ద్విపాత్రాభినయం చేసి విడుదలకు సిద్దంగా ఉన్న సినిమా 'సోగ్గాడే చిన్ని నాయిన'. సంక్రాంతి కానుకగా జనవరిలో 15న రిలీజ్ కు సిద్దం అవుతున్న ఈ సినిమాకు సంబందించిన బిజినెస్ ఓ ప్రక్కన జరుగిపోయింది. ఈ సినిమాను భారీ రేటు పెట్టి శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవి వారు తీసుకున్నారు. దీనికి ఆరున్నర కోట్లను చెల్లించనున్నారని సినిమా వర్గాలు అనుకుంటున్నాయి. నాగార్జున సినిమాలకు టీవి మాధ్యమంలో మంచి క్రేజ్ ఉండటంతో ఈ మొత్తాన్ని పెట్టి జెమినీ వారు తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.


కాకపోతే ఇప్పుడు ఈ సినిమాకు హిందీలో కూడా మార్కెట్ బాగానే జరుగుతోంది, దీనిని సుమారు కోటి రూపాయలతో నిర్మాల కుమారి అనే తర్డ్ పార్టీ పేరున నిర్మాతలు హింది శాటిలైట్ హక్కులను అడిగి తీసుకున్నట్లు సమాచారం.


‘Soggade Chinni Nayana’ Hindi satellite rights sold

గ్రామీణ నేపథ్యంలో సాగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఇందులో ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కుమాత్రమే కనబడే విచిత్రమైన ఆ పాత్రలో తాను నటించానని నాగార్జున తెలిపారు.


నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

English summary
‘Soggade Chinni Nayana’ makers have also sold the satellite rights of the Hindi dubbed version. A third party Nirmala Kumari bagged the rights for a whopping one Crore.
Please Wait while comments are loading...