»   » రెట్టింపు లాభం: సంక్రాంతి వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బస్టర్‌!

రెట్టింపు లాభం: సంక్రాంతి వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బస్టర్‌!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీసు రారాజు నాగార్జునే అని తేలి పోయింది. ఈసారి పండక్కి నాలుగు సినిమాలు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయానా' మాత్రమే. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

ఈ రివ్యూల పరంగా, మౌత్ టాక్ పరంగా ఎక్కువ రేటింగ్ వచ్చింది ఈ సినిమాకే. ఈ చిత్రాన్ని కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాత కూడా నాగార్జునే. చాలా ఏరియాల్లో ఆయనే సొంతగా రిలీజ్ చేసుకున్నారు. విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ చిత్రం లాభాలు గడించింది.


'Soggade Chinni Nayana' likely to enter the Rs 40 crore club

తాజాగా అందుతున్న సమాచారం ఈ చిత్రం 12 రోజుల్లో రూ. 34 కోట్ల షేర్ సాధించింది. ఇతర సినిమాలతో పోలిస్తే ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. విడుదలైన అన్ని థియేటర్లలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెలుతోంది. మరో ఆరు కోట్ల వసూలు చేసి త్వరలోనే రూ. 40 కోట్ల క్లబ్ లో చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


నైజాం ఏరియాలో సోగ్గాడే చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 10 కోట్ల షేర్ సాధించింది. ఓవర్సీస్ ఏరియాలోనూ మంచి లాభాలు గడిస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం అక్కడ రూ. 5 కోట్ల పైచిలుకు వసూలు చేసింది. ఇతర ఏరియాల్లోనూ సినిమా బిజినెస్ అదరగొడుతోంది. శాటిలైట్ రైట్స్, ఇతర రైట్స్ కలిపితే ఈ చిత్రం ఆధాయం రూ. 50 కోట్లపైనే ఉంటుందని అంచనా.

English summary
As per trade, 'Soggade Chinni Nayana' raked in a share of Rs 34 crore worldwide in a span of only 12 days. It is likely to enter the Rs 40 crore club very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu