»   » మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్న ‘S/O సత్యమూర్తి’

మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్న ‘S/O సత్యమూర్తి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న స్టార్ ఇమేజ్, త్రివిక్రమ్ సినిమాలకు ఉన్న బ్రాండ్ నేమ్ వెరసి.... ‘S/O సత్యమూర్తి' చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు తెచ్చి పెడుతున్నాయి. సినిమాకు మిక్స్‌డ్ వచ్చినప్పటికీ వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీసు వద్ద తొలి ఆరు రోజుల్లో రూ. 25 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది.

విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


ఏరియా వైజ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి...


నైజాం

నైజాం


నైజాం ఏరియాలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కలెక్షన్లు 9.77 కోట్లు


సీడెడ్

సీడెడ్


సీడెడ్ ఏరియాలో సినిమా కలెక్షన్లు రూ. 4.33 కోట్లు


వైజాగ్

వైజాగ్


వైజాగ్ ఏరియాలో సినిమా కలెక్షన్లు రూ. 2.61 కోట్లు


గుంటూరు

గుంటూరు


గుంటూరు ఏరియాలో సినిమా కలెక్షన్లు రూ. 2.34 కోట్లు


కృష్ణా

కృష్ణా


కృష్ణా ఏరియాలో సినిమా కలెక్షన్లు రూ. 1.78 కోట్లు


ఈస్ట్

ఈస్ట్


ఈస్ట్ గోదావరి ఏరియాలో సినిమా కలెక్షన్లు రూ. 1.91 కోట్లు


వెస్ట్

వెస్ట్


వెస్ట్ గోదావరి ఏరియాలో సినిమా కలెక్షన్లు రూ. 1.65 కోట్లు


నెల్లూరు

నెల్లూరు


నెల్లూరు ఏరియాలో సినిమా కలెక్షన్లు రూ. 0.91 కోట్లు, ఏపీ, తెలంగాణ టోటల్: రూ. 25.30 కోట్లు


English summary
After a decent Monday, Son Of Satyamurthy has managed to get housefuls in many locations on Tuesday. Despite being a working day, on its 6th day of release, Son Of Satyamurthy has collected a total share of 25.38 Cr in Andhra Pradesh and Telangana states.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu