For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ ‘లయన్’ నిర్మాత గురించే అంతటా చర్చ

  By Srikanya
  |

  హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లయన్'. సత్యదేవ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 9న విడుదలకానుంది. ఈ ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ చిత్రం కోసం చేయని విధంగా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 3డి సెట్ ఒకటి నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా రానున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నిర్మాత ...డబ్బుకు వెనకాడకుండా సినిమాని రిచ్ గా నిర్మించటం, ఆడియో పంక్షన్ ని సైతం ఎవరూ చేయని విధంగా 3డి సెట్ వేయటం వంటివి అంతటా చర్చనీయాంశంగా మారాయి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మొదట మేడే సందర్భంగా మే ఒకటిన విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 30నే ఈ సినిమా విడుదలయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, డైలాగులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

  Special 3D set for Balakrishna's Lion audio

  నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలెక్షన్లపై కన్నేసినట్టు కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన ఇంకా ఏదీ రాలేదు. బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ‘లయన్'. ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

  అలాగే ‘లయన్' శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

  ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు.

  నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.

  అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

  English summary
  The makers of Balayya’s Lion are planning to launch the audio in a grand way.As of now, it is heard that a special 3D set will be erected for the audio launch event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X