twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Spider Man day 1 collections.. ఇండియాలో టాప్ లేపిన స్పైడర్ మ్యాన్.. వందల కోట్లతో కనకవర్షం

    |

    ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ రూపొందించిన స్పైడర్ మ్యాన్: నో వే హో (Spider-Man No Way Home) చిత్రం భారీ అంచనాలతో భారత్‌లో థియేటర్లలో రిలీజైంది. కరోనా విపత్తు తర్వాత ఇండియాలో జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టూ డై సినిమా అనంతరం రిలీజైన అతిపెద్ద సినిమాగా Spider-Man No Way Home రికార్డులకెక్కింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అయితే డిసెంబర్ 16న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత సంపాదించిందంటే..

     ఇండియాలో ఒకరోజు ముందే రిలీజ్

    ఇండియాలో ఒకరోజు ముందే రిలీజ్

    Spider-Man No Way Home సినిమా విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 17వ తేదీన రిలీజైంది. కానీ ఇండియాలో మాత్రం ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ కారణంగా ఈ సినిమాను ముందే రిలీజ్ చేసి ఆకట్టుకొన్నారు. అయితే చిత్ర నిర్మాతల అంచనాలకు తగినట్టే ఈ సినిమాకు భారీ స్పందన ఇండియాలో కనిపించింది.

     ఇండియాలో అత్యధికంగా థియేటర్లలో

    ఇండియాలో అత్యధికంగా థియేటర్లలో

    Spider-Man No Way Home చిత్రం అత్యధికంగా ఇండియాలో 3264 థియేటర్లలో రిలీజైంది. మహారాష్ర వ్యాప్తంగా 50 శాతం అక్యుపెన్సీతో సినిమాను ప్రదర్శించారు. గతంలో అవెంజర్స్ ఇన్ఫినిటి వార్ 2 వేల థియేటర్లు, 2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ 2845 స్క్రీన్లలో ప్రదర్శించడం గమనార్హం. కోవిడ్ పరిస్థితుల తర్వాత ఈ రేంజ్‌లో రిలీజైన తొలి చిత్రంగా ఘనతను సాధించింది.

     అవెంజర్స్ ఎండ్ గేమ్ టాప్

    అవెంజర్స్ ఎండ్ గేమ్ టాప్

    ఇండియాలో ఇప్పటి వరకు రిలీజైన హాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే.. మార్వెల్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ అత్యధికంగా తొలి రోజు 53.10 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అవెంజెర్స్ ఇన్ఫినిటివార్ 31.62 కోట్లు నికరంగా, రూ.40.5 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కోవిడ్ తర్వాత రిలీజైన హాలీవుడ్, ఇతర విదేశీ చిత్రాలతో పోల్చితే రికార్డు వసూళ్లను Spider-Man No Way Home సాధించింది.

     ఇండియాలో 41.5 కోట్ల గ్రాస్ వసూళ్లు

    ఇండియాలో 41.5 కోట్ల గ్రాస్ వసూళ్లు

    ఇక తాజాగా రిలీజైన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. విడుదలైన ప్రతీ చోట 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ కనిపించింది. టామ్ హాలెండ్, జెండ్యా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు పోటేత్తారు. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 32.67 కోట్లు నికరంగా, 41.5 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు రిలీజైన హలీవుడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన రెండో చిత్రంగా రికార్డు సాధించింది.

     సూర్యవంశీ వసూళ్లను బ్రేక్ చేసిన స్పైడర్ మ్యాన్

    సూర్యవంశీ వసూళ్లను బ్రేక్ చేసిన స్పైడర్ మ్యాన్

    మహారాష్ట్రలో కోవిడ్ పరిస్థితుల తర్వాత రిలీజైన అక్షయ్ కుమార్ చిత్రం సూర్యవంశీ చిత్రం తొలి రోజున 26.29 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా వసూళ్లను Spider-Man No Way Home అధిగమించింది. బాలీవుడ్‌కు ఈ చిత్రం వసూళ్ల జోష్‌ను చూపించింది. రెండో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం లేకపోలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    Recommended Video

    Upasana Wished To Ramcharan In A Special Way
    ప్రపంచవ్యాప్తంగా 313 కోట్ల కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా 313 కోట్ల కలెక్షన్లు

    Spider-Man No Way Home చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. పలు దేశాల్లో ఓమిక్రాన్ భయాలు నెలకొనడంతో చాలా ప్రాంతాల్లో ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు. అయినా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 313 కోట్లు రాబట్టింది. ఈ వసూళ్లు కేవలం 15 దేశాలకు సంబంధించిన లెక్కలు కావడం గమనార్హం. యూకేలో కూడా 7.63 మిలియన్ పౌండ్స్ రాబట్టింది.ఫ్రాన్స్, రష్యా, తైవాన్, ఇటలీ దేశాల్లో మంచి స్పందన కనిపించింది. దాంతో సైడర్ మ్యాన్ సత్తా ఏమిటో మరోసారి బాక్సాఫీస్ రుచి చూసింది.

    English summary
    Spider-Man No Way Home released on december 16 in India and released 17th worldwide. This movie collected 41.5 crores gross in india and collected $43.6 millions worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X