twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SR Kalyanamandapam Day 2 Collections: ఇండస్ట్రీలో ధైర్యాన్ని నింపిన చోటా సినిమా కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే

    |

    పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ రిలీజ్ అవ్వడానికి బాగానే ధైర్యం చేస్తున్నాయి. ఇక కొన్ని కొత్త సినిమాలకు గత వారం షాక్ అయ్యే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. తిమ్మరుసు, ఇష్క్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఎట్రాక్ట్ చేయలేకపోయాయి. ఆ సినిమాలత్ రిజల్ట్ కారణంగా నిర్మాతల్లో అయితే మరోసారి కంగారు మొదలైంది. సినిమాలకు కొంత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద గతంలో మాదిరిగా సందడి లేకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. ఇక ఈ వారం వచ్చిన సినిమాలలో ఎస్ ఆర్ కళ్యాణమండపం మాత్రం కొంత ధైర్యాన్ని కలిగిస్తోంది.

    ప్రేక్షకులకు మంచి కంటెంట్ అనిపిస్తే ఏ మాత్రం వెనుకడుగు వేయరనేది మరోసారి రుజువయ్యింది. ఈ వారం ఆ సినిమాతో పాటు 'మ్యాడ్', 'ముగ్గురు మొనగాళ్లు', ' మెరిసే మెరిసే', 'క్షీర సాగర మథనం', 'రావణలంక', 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' అనే సినిమాలు వాటి శక్తి మేరకు బాగానే రిలీజ్ అయ్యాయి. ఇక ఈ బాక్స్ ఆఫీస్ పోటీలో మొదటి నుంచి కూడా ఎస్ ఆర్ కళ్యాణమండపం మంచి క్రియేట్ చేస్తూ వచ్చింది కలెక్షన్స్ లో కూడా సినిమా డామినేట్ చేయడం స్టార్ట్ సిగేసింది. ఇక రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే...

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్

    ధైర్యాన్ని నింపిన సినిమా

    ధైర్యాన్ని నింపిన సినిమా

    ఓ వైపు కరోనాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల గోల కూడా నిర్మాతలను ఆందోళనకు గురి చేసింది. కరోనా ఉన్నప్పటికీ సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ లోకి వస్తారని నమ్మకంతో ఉన్నప్పటికీ థియేటర్స్ టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న కొత్త రూల్ నిర్మాతలకు సంతృప్తినివ్వడం లేదు.

    ఈ కారణం వల్లనే చాలా సినిమాలను థియేట్రికల్ గా రిలీజ్ చేయడం ఎందుకని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల నారప్ప సినిమా అదే భయంతో ఓటీటీలో విడుదలైంది. మరికొన్ని సినిమాలు కూడా అదే రూట్లో అడుగులు వేయబోతున్నాయి. అయితే ఎస్ ఆర్ కళ్యాణమండపం మాత్రం పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ అందుకోవడం కొంత ఇండస్ట్రీకి ధైర్యాన్ని అయితే ఇస్తోంది.

    Shaakuntalam సెట్ లో అల్లు అర్జున్.. స్నేహతో కలిసి అర్హ యాక్టింగ్ చూసి మురిసిపోతూ!Shaakuntalam సెట్ లో అల్లు అర్జున్.. స్నేహతో కలిసి అర్హ యాక్టింగ్ చూసి మురిసిపోతూ!

    సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్న హీరో

    సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్న హీరో

    ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం మొదట పాటలతోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. విడుదలైన టీజర్ ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం ఇదివరకే రాజావారు రాణివారు అనే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ అందుకున్నాడు.

    ఇక ఎస్ఆర్.కళ్యాణమండపం సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందించి జనాల్లోకి తీసుకువెళ్లాడు. కొత్త దర్శకుడు శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రమోద్ రాజు నిర్మించారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్రలో నటించారు. ఇక చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

    భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..

    ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే ఎస్ ఆర్ కళ్యాణమండపం మొత్తంగా 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 4.8 కోట్ల టార్గెట్ తో విడుదల అయ్యింది. అసలైతే సినిమాకు ఓటీటీ కంపెనీల నుంచి ఆఫర్స్ భారీగానే వచ్చాయి. ఒక విధంగా పెట్టిన పెట్టుబడికి డబుల్ ఆఫర్స్ వచ్చాయి కానీ దర్శకనిర్మాతలు సినిమాపై నమ్మకంతో థియేటర్స్ లోనే విడుదల చేయాలని కృషి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో 400 థియేటర్లలో విడుదలైంది అమెరికాలో కూడా 30 లొకేషన్లలో ఈ సినిమా విడుదలైంది.

    2వ రోజు కలెక్షన్స్

    2వ రోజు కలెక్షన్స్

    ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా కొనసాగగా సెకండాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. సాయి కుమార్ నటన సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఇక మొదటి రోజు 1.4 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా మంచి వసూళ్లను అందుకుంది.

    రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే.. నైజాం ఏరియాలో రూ. 86 లక్షలు గ్రాస్, రూ. 53 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు గ్రాస్, రూ. 14 లక్షలు షేర్ దక్కింది. అలాగే, సీడెడ్‌లో రూ. 37 లక్షలు గ్రాస్, రూ. 7.4 లక్షలు షేర్ వసూళు అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 1.25 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం.

    రెండు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్

    రెండు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్

    ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాల్లో 4.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రూ. 4.80 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు రూ. 1.41 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. రెండవరోజు కూడా దాదాపు అదే తరహాలో 1.25కోట్ల షేర్ దక్కింది. ఇక రెండు రోజుల్లో మొత్తం 2.66కోట్లు వచ్చాయి.

    Recommended Video

    Mahesh Babu కోసం Malayalam హీరోయిన్ | Ssmb 28 Upadate | Filmibeat Telugu
    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఇంకా ఎంత రావాలి అంటే..

    బాక్స్ ఆఫీస్ పోటీలో మొదటి నుంచి కూడా ఎస్ ఆర్ కళ్యాణమండపం మంచి క్రియేట్ చేస్తూ వచ్చింది కలెక్షన్స్ లో కూడా సినిమా డామినేట్ చేయడం స్టార్ట్ సిగేసింది. అయితే సినిమా సేఫ్ జోన్ లోకి రావాలి అంటే ఇంకా రూ. 2.14 కోట్ల వరకు షేర్ రావాలి. అయితే సినిమాకు ఈ ఆదివారం చాలా కీలకం కానుంది. ఈ రోజు కూడా మొదటి రెండు రోజుల తరహాలో కలెక్షన్స్ అందుకుంటే సోమవారం నుంచి ఈజీగా జోన్ లోకి రావచ్చు. మరి ఎస్ఆర్.కళ్యాణమండపం ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

    English summary
    Kiran Abbavaram Now Did a Film SR Kalyanamandapam Under Sridhar Gade Direction.SR Kalyanamandapam Movie day 2 collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X