»   »  'ప్రేమమ్' : రీమేక్ రైట్స్ పొందిన తెలుగు నిర్మాత

'ప్రేమమ్' : రీమేక్ రైట్స్ పొందిన తెలుగు నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా సౌత్ సిని ప్రియుల నోళ్లలో నానుతున్న చిత్రం 'ప్రేమమ్' . ఈ మళయాళ చిత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం నిర్మాతలు నాగార్జున, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు, బెల్లంకొండ సురేష్ సైతం పోటీ పడ్డారు. అయితే స్రవంతి రవికిషోర్ ఈ చిత్రం రైట్స్ ని పొందినట్లు సమాచారం. స్రవంతి రవి కిషోర్ ఈ మధ్యకాలంలో మసాలా చిత్రం రూపొందించారు. ప్రస్తుతం శివం, హరి కథ చిత్రాలు చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం కోసం కోటిన్నర కోట్లు దాకా ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. తెలుగు వెర్షన్ కు శర్వానంద్ ని గానీ రామ్ ని తీసుకుని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ఎలా చెప్పను, పేరు లేని సినిమా, ఒంటిరి వంటి చిత్రాలు అందించిన దర్శకుడు రమణతో ఈ చిత్రాన్ని పునర్మించే ఆలోచనలో ఉన్నట్లు సినీ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.

జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు.

ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Premam

అప్పుడే పైరసీ....

అయితే రీసెంట్ గా ఆన్ లైన్ పైరసీకి గురి అయ్యింది. ఈ పైరసీకు కారణం ....మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్, స్టార్ డైరక్టర్ ప్రియదర్శన్ అని వార్తలు వస్తున్నాయి. దాంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇప్పటికీ హౌస్ ఫుల్ షోస్ తో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్న ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లీకేజి కు కారణంగా వీరినే టార్గెట్ చేయటానికి కారణమాలు మళయాళ మీడియాలో ఇప్పుడు ఊపందుకున్నాయి. ప్రేమమ్ సెన్సార్ కాపీ...లీక్ అయ్యింది. ఈ సెన్సార్ కాపీ.. ..విశ్వమాయ మాక్స్, ఫోర్ ఫ్రేమ్ నుంచి బయిటకు వచ్చింది.

ఈ విశ్వమాయ..గతంలో మోహన్ లాల్ , ప్రియదర్శన్ లది. ఈ మధ్యనే దాన్ని అమ్మివేసారు. అయితే ఈ విషయం తెలియని వారు ఆయన్ను ఈ కాంట్రావర్శిలోకి లాగుతున్నారు. విశ్వమాయ ని...ఏరీస్ గ్రూప్ కు అమ్మేయటం జరిగింది. అయితే కొందరు పాపులర్ ఆన్ లైన్ జర్నల్స్ వారు మోహన్ లాల్, ప్రియదర్శన్ లను బ్లేమ్ చేస్తూ కథనాలు రాస్తున్నారు.

ఇక ప్రియదర్శన్ విషయానికి వస్తే....ఆయనే తొలిసారి ఈ చిత్రం గురించి ట్వీట్ చేసింది. ఆయన ఈ చిత్రం చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఆయన ఈ చిత్రం టెక్నికల్ బ్రిలియన్స్ చూసి షాక్ అయ్యానని, నేరేటివ్ స్టైల్ కూడా అద్బుతంగా ఉందని, ఇది ప్యూచర్ మళయాళి సినిమా కు ఓ గొప్ప ప్రేరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

మరో ప్రక్క దర్శకుడు సైతం ఈ రూమర్స్ ని కొట్టిపారేస్తున్నారు. అలాంటి రూమర్స్ ని ప్రచారం చేయవద్దని కోరుతున్నాడు. కానీ నిర్మాత మాత్రం ఈ విషయమై మాట్లాడటం లేదు. మరో ప్రక్క మోహన్ లాల్, ప్రియదర్శన్ ఏమంటారా అని మళయాళ పరిశ్రమ, వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ అటు నుంచీ స్పందన రావటంలేదు.

English summary
premam recent Malayalam blockbuster, Premam, has piqued a lot of interest in Tollywood and we hear that producers are battling to acquire its remake rights. Premam, directed by Alphonse Puthren, has Nivin Pauly in the lead role. According to a source, producer Sravanthi Ravikishore is in talks with the makers of the film, which is a coming-of-age drama.
Please Wait while comments are loading...