For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ ’టెంపర్‌’ : నమ్మకంతో రైటర్ కై రైట్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : సినిమా బిజినెస్ విచిత్రమైనది, అనిశ్చమైనది... వస్తే ఓవర్ నైట్ లో కోట్లు వస్తాయి.లేదా..చేతిలో ఉన్న ఆఖరి పైసా తో సహా ఊడ్చేస్తుంది. అందుకే ఎంతో అనుభవమున్న వారు తప్ప అందులోకి వెళ్లటానకి ఆసక్తి చూపరు. కానీ తాము చేస్తున్న ప్రాజెక్టు మీద ఉన్న నమ్మకం మనిషిని ముందుగడు వేసేలా చేస్తుంది. ఇప్పుడు స్టార్ రైటర్ వక్కంతం వంశీ అలాంటి ఆలోచనే చేసాడంటున్నారు. ఆయన రచన చేసిన 'టెంపర్‌' చిత్రం నెల్లూరు రైట్స్ ని ఆయన తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇందుకోసం ఆయన రెండు కోట్లు పే చేసినట్లు తెలుస్తోంది.

  ఇక పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు 'టెంపర్‌‘. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరిగింది. మధ్యలో సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌ కొన్ని రోజులు ఆపేశారు. కాని సమ్మె విరమణ జరిగిందని సోమవారం నుంచి పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

  మరో ప్రక్క చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూరి జగన్‌ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే రిపీట్‌ అయ్యింది.

  ఇక ఐటెం సాంగ్స్‌కి క్రేజీ తెచ్చిన డెర్టెక్లర్లలో ఒకరు పూరిజగన్‌. టెంపర్‌ సినిమాలోనూ మొరాకోకు చెందిన మోడల్‌ నోరా ఫతేహి తో ఐటెం సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ సాంగ్‌లో అమ్మడు దుమ్మురేపడం ఖాయమంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. టెంపర్‌ చిత్రానికి ఈ పాటే హైలెట్‌ అవుతుందని టాక్‌. సాంగ్‌కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్‌ కూడా వేసి రంగం సిద్ధం చేశారట.

  Star writer bought NTR’S Temper Nellore rights

  ఎంత తొందరగా షూటింగ్‌ ముగిస్తే అంత తొందరగా సినిమాను విడుదల చేయవచ్చని పూరి అనుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు చిత్రం విడుదల చేసే ఆలోచనలో పూరిజగన్‌ ఉన్నారు. బండ్ల గణేష్‌ నిర్మాణ సారధ్యంలో సాగుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

  బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమాకు ‘టెంపర్‌' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేశాం. 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. డిసెంబర్‌ రెండో వారంలో కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా ఆడియో వేడుకను నిర్వహిస్తాం. జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు.

  కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  English summary
  Vakkantam Vamsi bought Temper righst for 2 crores which was a record price in Nellore region.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X