twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    West Side Story collections.. స్టీవెన్ స్పీల్ బర్గ్ మూవీ వసూళ్లు దారుణంగా.. చరిత్రలో ఊహించని కలెక్షన్లు

    |

    ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన వెస్ట్ సైడ్ స్టోరి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. భారీ అంచనాల మధ్య థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అయితే ఈ సినిమా కథ ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో రిలీజైంది. తొలివారాంతంలో ఎంత మేరకు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది అనే విషయాల్లోకి వెళితే..

    1957 చిత్రానికి రీమేక్‌గా

    1957 చిత్రానికి రీమేక్‌గా


    స్టివెన్ స్పీల్‌బర్గ్ సాధారణంగా రీమేక్ సినిమాలు అటెంప్టే చేయరు. కానీ 1957లో టోని కుష్నెర్ అనే రచయిత అందించిన వెస్ట్ సైడ్ స్టోరి అంటే స్పీల్ బర్గ్‌ చెప్పలేనంత ఇష్టం. అందుకే ఈ చిత్రంలోని భగ్నప్రేమికుల కథను మరోసారి ప్రేక్షకులకు చూపించి మధురానుభూతిని పంచాలనే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం ప్రఖ్యాత రచయిత షేక్‌స్పియర్ రాసిన రోమియో జూలియట్, జీరోమ్ రాబిన్స్, లియానార్డ్ బెర్న్‌స్టెయిన, స్టెఫాన్ షొందీమ్, ఆర్థర్ లారెంట్స్ రాసిన వెస్ట్ సైడ్ స్టోరి ఆధారంగా తెరకెక్కింది.

    100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో

    100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో


    1957 నాటి వెస్ట్ సైడ్ స్టోరి చిత్రాన్ని స్పీల్ బర్గ్ స్వయంగా నిర్మించారు. నిర్మాతగా, దర్శకుడిగా మారిన ఆయన ఈ సినిమాను 100 మిలియన్ అమెరికన్ డాలర్లతో తెరకెక్కించారు. నేటి సామాజిక పరిస్థితులకు అనుకూలంగా ఈ సినిమాను మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే స్పీల్ బర్గ్ సినిమా రిలీజైందంటే అభిమానులు థియేటర్లకు పోటెత్తేవారు. కానీ ఈ సినిమాకు అలాంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కనిపించడం లేదనే అభిప్రాయన్ని ట్రేడ్, సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు.

    నార్త్ అమెరికాలో దారుణంగా కలెక్షన్లు

    నార్త్ అమెరికాలో దారుణంగా కలెక్షన్లు


    హాలీవుడ్ తారలు ఆన్సెల్ ఎల్గోర్ట్, రాచెల్ జెగ్లేర్ కీలక పాత్రల్లో నటించిన వెస్ట్ సైడ్ స్టోరి చిత్రం ప్రపంచవ్యాప్ంగా 2820 ప్రాంతాల్లో రిలీజైంది. అయితే తొలి వారాంతానికి ఈ చిత్రం నార్త్ అమెరికాలో కేవలం 10.5 మిలియన్ డార్లు మాత్రమే వసూలు చేసింది. అంటే సుమారు 3800 డాలర్లను మాత్రమే వసూలు చేసింది. ఇక విదేశీ బాక్సాఫీస్ వద్ద కేవలం 4.4 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయడం ఓ షాకింగ్ పరిణామం. స్పీల్ బర్గ్ సినిమాకు ఇలా దారుణమైన కలెక్షన్లు రావడం అతడి కెరీర్లో ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు


    వెస్ట్ సైడ్ స్టోరి చిత్రం నార్త్ అమెరికాలో కాకుండా విదేశాల్లో 37 లొకేషన్లలో రిలీజైంది. అయితే ఈ సినిమా 4.4 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. విదేశాల్లో పలు ప్రాంతాల్లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అలా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు భారీగా తరలివస్తే తప్ప ప్రాఫిట్స్ సాధించలేదు. ప్రపంచవ్యాప్తంగా తొలి వీకేండ్‌కు కేవలం 14.9 మిలియన్లు మాత్రమే వసూలు చేయడం ఊహించని పరిణామం అంటూ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Recommended Video

    Happy Birthday NTR : Bandla Ganesh Fanism Towards Jr NTR
    కోవిడ్ భయాందోళనల కారణంగానే

    కోవిడ్ భయాందోళనల కారణంగానే


    అయితే సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న వెస్ట్ సైడ్ స్టోరి సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోవడానికి కారణాలను పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోవడం, ఓమిక్రాన్ వైరస్ ప్రభావం పెరిగిపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి జంకుతున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

    English summary
    Popular Director Steven Spielberg’s West Side Story not impressive at Box office. It collected 14.9 million dollars collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X