»   » సూపర్బ్ : ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్

సూపర్బ్ : ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మూడో సినిమా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. దిల్ రాజు నర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ (గురు, శుక్ర, శని, ఆది) మంచి వసూళ్లు రాబట్టింది.

ఏపీ-తెలంగాణల్లో ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్ రూ. 8.5 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.16 కోట్లు వసూలు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. తొలి రోజు ఈ సినిమా నైజాంలో 1.7 కోట్లు, సీడెడ్ లో 56 లక్షలు, నెల్లూరులో 16.4 లక్షలు, గుంటూరులో 40 లక్షలు, కృష్ణలో 21.2 లక్షలు, వెస్ట్ గోదావరిలో 25.5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 43 లక్షలు, వైజాగ్ లో 43.7 లక్షలు రాబట్టింది.


Subramanyam For Sale Opening Weekend (Four Days) Box Office Collections

రెండో రోజు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఏపీ-తెలంగాణల్లో 2.46 కోట్లు రాబట్టింది. నైజాంలో 85 లక్షలు, Ceeded 53 లక్షలు, నెల్లూరులో 8.5 లక్షలు, గుంటూరులో 23 లక్షలు, కృష్ణలో 17.64 లక్షలు, వెస్ట్ గోదావరిలో 13.5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 21.6 లక్షలు, వైజాగ్ లో 24 లక్షలు రాబట్టింది.


ఇక మూడో రోజైన శనివారం 1. 88 కోట్లు వసూలు చేసింది. నైజాంలో 70లక్షలు, సీడెడ్ లో 40 లక్షలు, నెల్లూరులో 6.94 లక్షలు, గుంటూరులో 15 లక్షలు, కృష్ణలో 10.38 లక్షలు, వెస్ట్ గోదావరిలో 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 13.75 లక్షలు, వైజాగ్ లో 19.76 లక్షలు వసూలు చేసింది.


4వ రోజైన ఆదివారం ఈ చిత్రం దాదాపు రూ. 2 కోట్లు వసూలు చేసినట్లు అంచనా.

English summary
Supreme Hero Sai Dharam Tej's third offering Subramanyam For Sale, directed by Harish Shankar and Produced by Dil Raju, has been doing great business in Telugu states and might end up as a blockbuster venture.
Please Wait while comments are loading...