For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gaalodu Collections: సుధీర్ సంచలన రికార్డు.. 6 రోజుల్లోనే టార్గెట్ ఉఫ్.. RRR, KGF జాబితాలో గాలోడు

  |

  బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుర్రాళ్లు పరిచయం అయ్యారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ షో ద్వారా పరిచయమైన అతడు.. అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇటీవలే 'గాలోడు' అనే సినిమాతో హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ 6 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా చూసేయండి మరి!

  గాలోడుగా సుధీర్ హడావిడి

  గాలోడుగా సుధీర్ హడావిడి

  బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.

  జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష: హాట్ షోలో గీత దాటేసి మరీ రచ్చ

  గాలోడు బిజినెస్ వివరాలు

  గాలోడు బిజినెస్ వివరాలు

  గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసినా సుడిగాలి సుధీర్‌కు పెద్దగా మార్కెట్ ఏర్పడలేదు. కానీ, అతడు తాజాగా నటించిన 'గాలోడు' మూవీపై మాత్రం ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అంటే దాదాపు రూ. 6 కోట్లు గ్రాస్ మేర వసూలు చేయాల్సి ఉంటుంది.

  6వ రోజు ఎంత వచ్చింది?

  6వ రోజు ఎంత వచ్చింది?

  సుధీర్ నటించిన 'గాలోడు' మూవీని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే దీనికి మొదటి రోజు రూ. 1.21 కోట్లు గ్రాస్, రెండో రోజు రూ. 1.14 కోట్లు గ్రాస్, మూడో రోజు రూ. 1.61 కోట్లు గ్రాస్, నాలుగో రోజు రూ. 84 లక్షలు గ్రాస్, ఐదో రోజు రూ. 65 లక్షలు గ్రాస్ వసూలు అయింది. ఈ క్రమంలోనే ఆరో రోజు దీనికి రూ. 65 లక్షలు గ్రాస్‌, రూ. 32 లక్షలు షేర్ వచ్చింది.

  బీచ్‌లో అందాల తెర తీసేసిన శ్రీముఖి: అక్కడ ఆకును అడ్డుగా పెట్టి మరీ!

  6 రోజులకు ఎంతొచ్చింది?

  6 రోజులకు ఎంతొచ్చింది?

  సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో బాగానే రాబట్టింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 2.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 75 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 2.97 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 6 రోజుల్లో రూ. 5.97 కోట్లు గ్రాస్, రూ. 3.26 కోట్లు షేర్ రాబట్టింది.

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

  ఆరు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.97 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 12 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 6.09 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.26 కోట్లు షేర్‌ను వచ్చింది.

  బ్రాతో యాంకర్ రష్మీ ఓవర్ డోస్ హాట్ షో: తొలిసారి ఇలా తెగించిన బ్యూటీ

  టార్గెట్‌కు ఎంత దూరంలో

  టార్గెట్‌కు ఎంత దూరంలో

  సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లో రూ. 3.26 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 26 లక్షలు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

  టాలీవుడ్‌లో 18వ సినిమా

  టాలీవుడ్‌లో 18వ సినిమా

  సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన 'గాలోడు' మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. తద్వారా 2022లో విజయం సాధించిన 18వ సినిమాగా ఇది నిలిచింది. అదే సమయంలో RRR, KGF సహా పలు హిట్ చిత్రాల జాబితాలో 'గాలోడు' చోటు దక్కించుకుంది.

  English summary
  Jabardasth Talented Comedian Sudigali Sudheer Did Gaalodu Movie Under Rajasekar Reddy Pulicharla Direction. This Movie Collects Rs 5.55 cr Gross in 6 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X