twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sulthan Day 1 collections: కార్తీకి రికార్డు స్థాయి కలెక్షన్లు.. తెలుగులో రెండో మూవీగా ‘సుల్తాన్’

    |

    తెలుగు రాష్ట్రాల్లో కొంత మంది తమిళ హీరోలకు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అందులో సూర్య సోదరుడిగా పరిచయం అయిన కార్తీ ఒకడు. అన్న కంటే ఆలస్యంగానే సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ... మంచి మంచి సినిమాలతో అతడి కంటే ముందే టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. అందుకు అనుగుణంగానే ప్రతి సినిమానూ ఇక్కడ విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కార్తీ 'సుల్తాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఫస్ట్ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

     రష్మికతో కలిసి ‘సుల్తాన్'లా వచ్చిన హీరో కార్తీ

    రష్మికతో కలిసి ‘సుల్తాన్'లా వచ్చిన హీరో కార్తీ

    సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రమే 'సుల్తాన్'. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌ఆర్‌ ప్రకాష్ బాబు, య‌స్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. వివేక్ మెర్విన్ ఈ చిత్రానికి పాటలు అందించగా.. యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

    భారీగా అంచనాలు.. తెలుగులో బిజినెస్ ఇలా

    భారీగా అంచనాలు.. తెలుగులో బిజినెస్ ఇలా

    తమిళంలో 'సుల్తాన్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అక్కడ అదిరిపోయే బిజినెస్ చేసుకుందీ చిత్రం. ఇక, తెలుగులోనూ టీజర్, ట్రైలర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే నైజాంలో రూ. 2 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోటి, ఆంధ్రాలో రూ. 3 కోట్లతో మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్ల మేర వ్యాపారం జరుపుకుంది.

    గ్రాండ్‌గా రిలీజ్.. అందుకు తగ్గట్లుగానే రివ్యూలు

    గ్రాండ్‌గా రిలీజ్.. అందుకు తగ్గట్లుగానే రివ్యూలు

    పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ 'సుల్తాన్' గ్రాండ్‌గానే విడుదలైంది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్'కు సమానంగా థియేటర్లను దక్కించుకున్న ఈ చిత్రం.. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందననే దక్కించుకుంది. ఫలితంగా అన్ని చోట్లా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. రివ్యూలు కూడా ఈ చిత్రానికి పాజిటివ్‌గానే వచ్చాయి.

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత మేర వసూలు చేసింది?

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత మేర వసూలు చేసింది?


    మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 'సుల్తాన్' సత్తా చాటింది. తెలుగు చిత్రాలకు థీటుగా నైజాంలో రూ. 42 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌లో రూ. 10 లక్షలు, వెస్ట్‌లో రూ. 7.30 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 11.50 లక్షలు, నెల్లూరులో రూ. 5.20 లక్షలతో రెండు రాష్ట్రాల్లో రూ. 1.17 కోట్లు షేర్, రూ. 2.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్‌గా?

    ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్‌గా?

    తెలుగు రాష్ట్రాలో 'సుల్తాన్' సినిమా రూ. 6 కోట్ల మేర వ్యాపారం జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదైంది. అలాంటిది మొదటి రోజే ఈ డబ్బింగ్ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.17 కోట్లు వసూలు అయింది. అంటే.. ఈ సినిమా మన దగ్గర క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 5.33 కోట్లు వసూలు చేయాలి. ఈ రెండు రోజులు ఎంతో కీలకం.

    తెలుగులో రెండో సినిమాగా ‘సుల్తాన్' రికార్డు

    తెలుగులో రెండో సినిమాగా ‘సుల్తాన్' రికార్డు

    శుక్రవారం విడుదలైన నాగార్జున 'వైల్డ్ డాగ్'తో సమానంగా కార్తీ 'సుల్తాన్' కలెక్షన్లను రాబట్టుకుంది. తద్వారా ఏకంగా రూ. 1.17 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా తెలుగులో మొదటి రోజు ఎక్కువ వసూళ్లు చేసిన రెండో కార్తీ చిత్రంగా ఇది నిలిచింది. గతంలో అతడు నటించిన 'కాశ్మోరా'కు రూ. 2.25 కోట్లు వచ్చాయి. దాని తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం 'సుల్తాన్' కావడం విశేషం.

    English summary
    Sulthan is an upcoming Indian Tamil-language action thriller drama film, written and directed by Bakkiyaraj Kannan, and produced by S. R. Prakash Babu and S. R. Prabhu under the banner Dream Warrior Pictures. The film stars Karthi and Rashmika Mandanna, the latter's debut in Tamil film industry. Napoleon, Lal, Yogi Babu and Ramachandra Raju play supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X