»   » పవన్ ,మహేష్, బన్ని .. ఓ 500 కోట్లు

పవన్ ,మహేష్, బన్ని .. ఓ 500 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంక్రాంతికి 200 కోట్లు బిజినెస్ జరిగితేనే అబ్బో అనుకున్నారు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. కానీ ఇప్పుడు ఈ మెత్తం ఒక్కసారిగా ఏకంగా 500 కోట్లకు చేరనుంది. ఈ సమ్మర్ సినీ ప్రియులకు మజాను, సినిమా బిజినెస్ లో ఉన్నవారకు కాసుల వర్షాన్ని అందివ్వనుంది.

ఈ సంవత్సరం ప్రారంభమే నాన్నకు ప్రేమతో, నేను శైలజా, సోగ్గాడే చిన్ని నాయినా, డిక్టేటర్ మరియు ఎక్స్ ప్రేస్ రాజా సినిమాలే సుమారు 130 కోట్ల బిజినెస్ జరిగింది, ఇందులోనే దియోటర్స్, సాటిలైట్ మరియు ఆడియో అన్ని హక్కులతోనే. సుమారు 240 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు సాగాయి.

ఇప్పుడేమో సమ్మర్ కు ఏకంగా సుమారు ఓ 30 సినిమాల వరకు రిలీజ్ అవ్వనున్నాయి. మార్చ్ 11 నుండి 16 వరకూ ఎమ్ సెట్ పరీక్షలు వుండటంతో ఈ సినిమాలన్ని మార్చ్ 16 తర్వతే రిలీజ్ అవుతాయి. అంటే మార్చ్ 25 నుండి మే 27 వరకు ఈ సినిమాల పంజా కోనసాగుతుంది.

తెలుగు సినిమాకు సంబందించి నిజంగా ఈ సమ్మర్..ఉత్సవంలా మారేటట్లుంది నట్టుంది. మరి ఈ క్రేజ్ ని ఏ సినిమాలు నిలబెట్టుకుంటాయో లెదో చూడాలి.

దీనికి సంబందించిన స్లైడ్ షో మీకోసం

ఊపిరి.

ఊపిరి.

నాగార్జున, కార్తీలు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడపల్లి దర్శకుడు. తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

అ..ఆ ( అనసూయా రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి)

అ..ఆ ( అనసూయా రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి)

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతిలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో నితిన్, హీరోయిన్ సమంతా. మరి ఈ సినిమాకు టైటిల్ కొత్త అనుభూతిని అందిస్తోంది. మరి సినిమా ఎలా వుంటుందో.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

పవన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమాకు సోంతంగానే స్క్రిన్ ప్లే రాసుకున్నారు. కాజల్ హీరోయిన్ కాగా, దేవికశ్రీ సంగీతం అందిస్తున్నారు. దీనికి బాబి దర్శకుడు.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

మహేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాలా డైరక్షన్ లో ఈ సినిమా రాబోతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమా హీట్ అవ్వడంతో ఈసినిమా పై అంచనాలు బాగానే వున్నాయి.

సరైనోడు

సరైనోడు

మాస్ హిట్ సినిమాల డైరక్టర్ బోయపాటి, అల్లు అర్జున్ తో చేస్తున్న మాస్ మసాలా. మరి ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఫలితం ఎమౌతుందో చూడాలి.

కబాలి

కబాలి

రజనికాంత్ డాన్ కనిపించబోతున్న ఈ సినిమాకూడా వేసవికి సిద్దం అవుతోంది. అప్పట్లో వచ్చిన భాషాలా వుంటుందని ప్రేక్షకులు ఆశ పడుతున్నారు.

సూర్య 24

సూర్య 24

వెరైటీ చిత్రాలు చేసే ఈ హీరో చేస్తున్న కొత్త సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ గా ఇది రూపోందుతోంది. మరి ఏమేరకు విజంయం వరిస్తుందో చూడాలి.

రాబిన్ హుడ్

రాబిన్ హుడ్

రవితేజా హీరోగా,దామోదర్ ప్రసాద్ ప్రోడ్యూసర్ గా వస్తున్న ఈ సినిమా చాలా ఆసక్తిని రేపుతోంది. చక్రి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

గొపిచంద్ ఆక్సిజన్

గొపిచంద్ ఆక్సిజన్

గోపీచంద్, ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్ రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాను సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఐశ్వర్య నిర్మిస్తోంది.యువన్‌ శంకర్‌ రాజా స్వరాలను అందిస్తారు. విలన్ గా జగపతిబాబు నటిస్తున్నారు. హీరోయిన్ గా రాశీఖన్నా ఎంపికైంది.

సుప్రీమ్

సుప్రీమ్

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'సుప్రీమ్‌'. రాశీ ఖన్నా హీరోయిన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఇప్పటికే ఫ్లాప్స్ తో ఉన్న ఈ హీరో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

బాబు బంగారం

బాబు బంగారం

వెంకటేశ్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా 'బాబు బంగారం'. మొదట నుండి వెంకిని ఇండస్ట్రీలో అందరూ బాబు అని పిలుస్తుండటం కూడా ఈ చిత్రానికి కలసివచ్చే అంశం. ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాహసం శ్వాసగా సారిపో

సాహసం శ్వాసగా సారిపో

నాగ చైతన్య, గౌతం మీనన్, ఏఆర్ రెహమాన్ ఈ ముగ్గురి కాంబినేషన్ రాబోతున్న సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో'. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపోందుతున్న ఈ సినిమా ఏ మేరకు విజంయం సాధిస్తుందో చూడాలి.

పండగల వచ్చాడు.

పండగల వచ్చాడు.

పండగలా వచ్చాడు ఈ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ గా రూపోందుతోంది. ఇందులో నారా రొహిత్, నీలమ్ ఉపాద్యాయ జంటగా నటిస్తున్నారు.ఈ సినిమాకి దర్శకత్వం కార్తీకేయ ప్రసాద్ కాగా నిర్మాత తోండపు నాగేశ్వర రావు. ఈ సినిమాకు సంగీతం అనూఫ్ రుబేన్స్ అందిస్తున్నారు.

మజ్ఞు

మజ్ఞు


మళయాళి సినిమా ప్రేమమ్ ని తెలుగులో 'మజ్ఞు' టైటిల్ తో నాగ చైతన్య చేస్తున్నారు. శృతి హాసన్..టీచర్ గా ఈ సినిమాలో కనిపించనుంది. ఓ మంచి హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న చైతుకు ఈ సారైనా విజయం దక్కలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈడు గొల్ట్ ఎహే

ఈడు గొల్ట్ ఎహే

సునిల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే. హిలేరియస్ ఎంటర్ టనర్ గా రూపొందుతోంది. చాలా కాలం నుండి సునిల్ తో హిట్ దోబుచులాడుకుంటోంది.

ఆటడుకుందాం రా

ఆటడుకుందాం రా

సుశాంత్‌ హీరోగా, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న సినిమా 'ఆటాడుకుందాం రా'. ఈ సారైనా హిట్ సాధిస్తాడో లేక ..

చంద్ర శేఖర్ యోలేటి (ఇంకా పేరు పెట్టలేదు)

చంద్ర శేఖర్ యోలేటి (ఇంకా పేరు పెట్టలేదు)

ఇంకా పేరు పెట్టని, మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ను కూడా వేసవికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సినిమా ఎ మాత్రం విజయం సాధిస్తుందో చూడాలి.

సావిత్రి

సావిత్రి

సావిత్రి యాక్షన్ అండ్ రోమాటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపోందుతోది. నారా రోహిత్, నందిత హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం పవన్ సాదినేని. బి రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రవణ్. మరి ఈ సినిమా పరిస్థితి ఎంటో చూడాలి మరి.

English summary
Tollywood total business in this summer 2016 would cross 500 crores that includes all Theatrical + Satellite + Audio and Other Rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu