For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gully Rowdy Day 1 collections: ‘గల్లీ రౌడీ’కి షాకింగ్ కలెక్షన్స్.. రెండు మూవీల తర్వాత దీనికే ఎక్కువ

  |

  చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభం నుంచీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాడు టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్. అప్పుడెప్పుడో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో ఫస్ట్ హిట్ కొట్టిన అతడు.. ఆ తర్వాత చాలా కాలానికి 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వరుసగా ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నాడు. ఇక, ఈ ఏడాది 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అంటూ వచ్చిన అతడికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సారి గట్టిగా కొట్టాలని సందీప్ నటించిన చిత్రమే 'గల్లీ రౌడీ'. శుక్రవారమే విడుదలైన ఈ సినిమాకు షాకింగ్‌గా కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ డే రిపోర్టును చూద్దాం పదండి!

  ‘గల్లీ రౌడీ’గా మారిన సందీప్ కిషన్

  ‘గల్లీ రౌడీ’గా మారిన సందీప్ కిషన్

  సందీప్ కిషన్ హీరోగా జీ నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'గల్లీ రౌడీ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ నటించింది. బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలను పోషించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చాడు.

  బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఆ శృంగారం ఎలా చేస్తారో వివరిస్తూ వీడియో.. అక్కలు, ఆంటీల కోసమే అంటూ!

  అంచనాలు బాగానే.. బిజినెస్ ఇలా

  అంచనాలు బాగానే.. బిజినెస్ ఇలా

  హిట్ కోసం వేచి చూస్తోన్న సందీప్ కిషన్.. ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'గల్లీ రౌడీ' అనే కామెడీ మూవీలో నటించాడు. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

  భారీగా రిలీజ్.. టాక్‌ పట్టించుకోలేదు

  భారీగా రిలీజ్.. టాక్‌ పట్టించుకోలేదు

  ఎన్నో ఆశలు, అంచనాల నడుమ 'గల్లీ రౌడీ' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, ఊహించని విధంగా మ్యాట్నీ నుంచి ప్రేక్షకుల స్పందన భారీగా వచ్చింది. ఇక, సాయంత్రం థియేటర్లు అన్నీ ఆడియెన్స్‌తో నిండిపోయాయి.

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

  తొలి రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

  తొలి రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

  'గల్లీ రౌడీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 61 లక్షలు షేర్, రూ. 1 కోటి గ్రాస్ వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లిలా

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లిలా

  తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రాణించలేకపోయిన'గల్లీ రౌడీ' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ అదే స్పందనను అందుకుంది. ఫలితంగా మొదటి రోజు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 లక్షలు, ఓవర్సీస్‌లో కేవలం రూ. 50 వేలు మాత్రమే కలెక్ట్ చేసింది. వీటితో కలుపుకుంటే ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. రూ. 63 లక్షలు షేర్, రూ. 1.04 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

  Bigg Boss: పర్సనల్ విషయాలపై లేడీస్ పచ్చి మాటలు.. వాడుకుని వదిలేయ్ అంటూ ఆమెతో దారుణంగా!

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే హిట్?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే హిట్?


  మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయితే, 'గల్లీ రౌడీ' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు కేవలం రూ. 63 లక్షలు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం.. మరో రూ. 2.37 కోట్లు రాబట్టాల్సి ఉంది.

  ఆ రెండు సినిమాల తర్వాత ఇదేనని

  ఆ రెండు సినిమాల తర్వాత ఇదేనని

  సందీప్ కిషన్ నటించిన చిత్రాల్లో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూలైన షేర్లు చూసుకుంటే.. అన్నింటి కంటే ముందు 'నిను వీడని నీడను నేనే' ఉంది. దీనికి రూ. 90 లక్షలు వచ్చాయి. ఆ తర్వాత రూ. 76 లక్షలతో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' ఉంది. ఇక, వీటి తర్వాత ఇప్పుడు 'గల్లీ రౌడీ' మూవీ రూ. 61 లక్షలు రాబట్టింది. 'తెనాలి రామకృష్ణ'కు రూ. 55 లక్షలు వచ్చాయి.

  English summary
  Young Hero Sundeep Kishan Did Gully Rowdy Movie Under G Nageshwar Reddy Direction. This Movie Collected 63L in First Day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X