»   » ఫైనల్ గా సునీల్ కే దెబ్బ పడింది

ఫైనల్ గా సునీల్ కే దెబ్బ పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో సునీల్ తన కెరీర్ ని బలపరుచుకోవడానికి కష్టపడుతున్నా అనుకున్న స్దాయిలో అతనికి కలిసిరావటం లేదు. అంతెందుకు... భీమవరం బుల్లోడు తర్వాత ఇప్పటికి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మరో ప్రక్క సునీల్ హీరోగా చేసిన కొత్త సినిమా 'కృష్ణాష్టమి' రిలీజుకు అడ్డంకులేన్నో ఆసినిమా షూటింగ్ పూర్తి అయి చాలాకాలం అయింది. సుమారు 3 నెలల నుండి వాయిదా పడుతు వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కి విడుదల చేయాలని భావించినా అదికూడా ఫిబ్రవరికి వాయిదా వేయాడానికి దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

నిజానికి నవంబరులోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఆఖిల్, మిగతా సినిమాల వలన వాయిదా పడింది. పోనీ పొంగల్ కు విడుదల పెట్టుకుందామనుకుంటే...ఇప్పడు సంక్రాంతి ఎన్టీఆర్, బాలకృష్ణ నాగార్జున సినిమాలు రిలీజ్ అవుతుండటం ఈ 'కృష్ణాష్టమి' కి కష్టాలు తప్పడం లేదు.

Sunil 's movie not coming to Pongal?

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. దర్శకత్వం - స్క్రీన్‌ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - కోనా వెంకట్. ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

English summary
This Pongal time, NTR, Balakrishna and Nagarjuna are competing with each other, hence Dil Raju backed off releasing Sunil's movie.
Please Wait while comments are loading...