»   »  'సుప్రీమ్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ , పాసైనట్లేనా?

'సుప్రీమ్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ , పాసైనట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన సుప్రీమ్ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పటాస్ ఫేం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ...దిల్ రాజు నిర్మించడంతో సినిమాకు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్లే సినిమా పూర్తి స్దాయి ఫన్ తో ఉండటంతో హిట్ టాక్ తెచ్చుకుంది.


మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సుప్రీమ్ చిత్రం చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడనే చెప్పాలి. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంతో మొదటి రోజు కలెక్షన్స్ బాగానే వసూల్ చేసి, వీకెండ్ పూర్తయ్యే సరిసి 9.93 కోట్లు వసూలు చేసారు. ఈ వసూళ్లు సాయిధరమ్ కేరీర్‌లో హయ్యస్ట్ ఫస్ట్ డే వసూళ్లుగా రికార్డులకెక్కాయి.


ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఇందులో నటించటం ప్లస్ అయ్యింది. అలాగే కథకు కీలకంగా మారిన బాల నటుడు మైఖేల్ గాంధీ ఈ మూవీ సక్సెస్ కి కారణం అయ్యాడు. మొత్తంగా సుప్రీమ్ మూవీ సాయి ధరమ్ తేజ్ కి మంచి సక్సెస్ ని ఇచ్చిందని అంటున్నారు. బ్రూస్ లీ, సర్ధార్ గబ్బర్ సింగ్, నిరుత్సాహ చిత్రాల తరువాత వచ్చిన సుప్రీమ్...మెగా ప్రేక్షకులను బాగా అలరించిందని అంటున్నారు.


సుప్రీం చిత్రం ఏరియావైజ్ గా కలెక్షన్లు స్లైడ్ షోలో...


నైజాం

నైజాం

నైజాం ఏరియా మెగా హీరోలకు పెట్టని కోటలా ఉంటూ వస్తోంది. ఇక్కడ సుప్రీం చిత్రం రూ 3.33 కోట్లు వసూలు చేసింది.సీడెడ్

సీడెడ్

సుప్రీం చిత్రం సీడెడ్ ప్రాంతంలో రూ 1.24 కోట్లు ఈ వీకెండ్ లో వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

వెస్ట్ గోదావరిలో సుప్రీమ్ చిత్రం : 0.80 కోట్లు వసూలు చేసింది.తూర్పు గోదావరి

తూర్పు గోదావరి

ఈస్ట్ గోదావరిలో 0.88 కోట్లు వసూలు చేసింది సుప్రీమ్ చిత్రం.వైజాగ్

వైజాగ్

మెగా హీరోలకు మొదటి నుంచీ వైజాగ్ లో మంచి పట్టు ఉంది. అక్కడ 0.91 కోట్లు వసూలు చేసింది.


గుంటూరు

గుంటూరు

సుప్రీమ్ చిత్రం గుంటూరు లో 0.70 కోట్లు వసూలు చేసింది.కృష్ణా

కృష్ణా

కృష్ణా జిల్లాలో సుప్రీమ్ చిత్రం 0.63 కోట్లు వసూలు చేసిందినెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ప్రాంతంలో సుప్రీమ్ చిత్రం 0.24 కోట్లు వసూలు చేసింది.రెండు చోట్లా

రెండు చోట్లా

ఏపీ + తెలంగాణ : 8.73 కోట్లు ఈ వీకెండ్ లో వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.కర్ణాటక

కర్ణాటక

కర్ణాటక ప్రాంతంలో సుప్రీమ్ చిత్రం 0.80 కోట్లు వసూలు చేసింది. అక్కడా మెగా హీరోలకు మంచి ఆదరణ ఉంది.మిగతా చోట్ల

మిగతా చోట్ల

సుప్రీమ్ .. భారత్ లో మిగతా ప్రాంతాలు- 0.40 కోట్లు వసూలు చేసింది.మొత్తం

మొత్తం

ఈ వీకెండ్ లో సుప్రీమ్ మొత్తం 9.93 కోట్లు వసూలు చేసింది.English summary
Sai Dharam Tej's "Supreme," featuring Rashi Khanna in the female lead has collected a total of ten crores shares at BO by its first weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu