»   » కలెక్షన్స్ కేక: దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చిన సూర్య!

కలెక్షన్స్ కేక: దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చిన సూర్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సింగం సిరీస్ చిత్రాలతో సూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటున్న తమిళ స్టార్ సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'ఎస్ 3' (సింగం 3) బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. తెలుగులో ఈ చిత్రానికి స్పందన మామూలుగానే ఉన్నా....తమిళనాడులో కలెక్షన్స్ అదరగొడుతోంది. దీంతో పొంగిపోయిన సూర్య దర్శకుడికి గిఫ్ట్ ఇచ్చారు.

సినిమా సూపర్ హిట్ అయి భారీ వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరికి ఖైరీదైన గిఫ్టు ఇచ్చారు సూర్య. టయోటా ఫోర్చునర్ న్యూ మోడల్ కారును బహుమతిగా అందించారు. హైదరాబాద్ లో జరిగిన సింగం 3 సక్సెస్ మీట్ లో దర్శకుడు హరి మాట్లాడుతూ... త్వరలోనే సింగం-4 ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

కారు గిఫ్టుగా

కారు గిఫ్టుగా

సింగం సిరీస్ చిత్రాలతో తనకు వరస విజయాలు అందిస్తున్న దర్శకుడు హరి కోసం కారు గిఫ్టుగా ఇచ్చారు. ఈ కారు ఖరీదు రూ. 40 నుండి 45 లక్షలు ఉంటుందని అంచనా.

ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ఆనందం

ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ఆనందం

ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడం అంత తేలికైన విషయం కాదు. దక్షిణాదిన ప్రతి ఏడాది వెయ్యి సినిమాలు రిలీజ్ అయితే అందులో కేవలం 7 శాతం మాత్రమే. అందుకే ప్రతీ విజయం కొండంత ఆత్మ విశ్వాసం కలిగిస్తుంది అని సూర్య ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చారు.

వసూళ్లు ముఖ్యం కాదు, ఎంత మంది మనసు గెలిచామన్నదే ముఖ్యం

వసూళ్లు ముఖ్యం కాదు, ఎంత మంది మనసు గెలిచామన్నదే ముఖ్యం

ఎన్ని వసూళ్లు దక్కాయి అన్నది కాదు.. ఎంతమంది మనసుల్ని గెలుచుకొన్నాం అనేదే ముఖ్యం. కొన్ని సినిమాలు విమర్శకులకు నచ్చుతాయి. కానీ బాక్సాఫీసు దగ్గర ఫలితం రాబట్టుకోవడంలో విఫలం అవుతాయి. ఇంకొన్ని బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకొన్నా, విమర్శకులకు నచ్చవు. కానీ ‘ఎస్‌ 3' అందరికీ నచ్చింది అని సూర్య చెప్పుకొచ్చారు.

హరి

హరి

దర్శకుడు హరి మాట్లాడుతూ సినిమా విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ‘సింగం 4' కూడా ప్లాన్ చేస్తున్నాం. అయితే దానికి మరో నాలుగైదేళ్ల సమయం పడుతుంద''న్నారు.

English summary
South star Surya's latest movie S3, released a week ago and is racing ahead at the box-office with record collections in Surya’s career. As a thank you gesture, Surya gifted Hari a brand new Toyota Fortuner car.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu