»   » సూర్య, నితిన్‌కు ఆ విషయంలో పడకనే ‘24’ డీల్ క్యాన్సిల్!

సూర్య, నితిన్‌కు ఆ విషయంలో పడకనే ‘24’ డీల్ క్యాన్సిల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24' చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ తన శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని బాహాటంగా ప్రకటించారు. అయితే ఇపుడు మాత్రం పరిస్థితి మారిందని అంటున్నారు. ఈ సినిమా నుండి నితిన్ తప్పుకున్నట్లు సమాచారం. దీంతో స్టూడియోన్ గ్రీన్ సంస్థ వారే ఈ చిత్రాన్ని నేరుగా తెలుగులో విడుదల చేస్తున్నారట.

'24' చిత్రం రిలీజ్ విషయంలో ఏర్పడ్డ వివాదమే ఈ డీల్ క్యాన్సిల్ కావడానికి కారణం అని తెలుస్తోంది. సూర్య 24 చిత్రాన్ని మే 6న తమిళం, తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అయితే అదే రోజు తెలుగులో నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ..ఆ' రిలీజ్ చేయబోతున్నారు. మే 6న అయితే ఆ సినిమాను తాము రిలీజ్ చేయలేమని నితిన్ ఫాధర్ సుధాకర్ రెడ్డి సూర్యకు తేల్చి చెప్పినట్లు సమాచారం. సినిమాను తమిళంతో పాటు తెలుగులో అదే రోజు రిలీజ్ చేయాలని సూర్య స్పష్టం చేయడంతో.... డీల్ క్యాన్సిల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

Surya, Nithin 24 deal cancelled

ఆ తర్వాత సూర్యకు, నితిన్ ఫాదర్ మధ్య చర్చలు జరిగినా విఫలం అయ్యాయని టాక్. తన కుమారుడి సినిమా అదే రోజున విడుదలవుతున్నందున..... రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేసే రిస్క్ తాను చేయబోనని సుధాకర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకే నిన్న హైదరాబాద్ లో జరిగిన '24' ప్రెస్ మీట్ కు నితిన్ గానీ, ఆయన ఫాదర్ కానీ హాజరు కాలేదు.

సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య 3 పాత్రలు, 5 గెటప్పుల్లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

Read more about: sudhakar reddy
English summary
Nithin and his father Sudhakar Reddy have backed out of the deal and Studio Green is planning to release 24 in Telugu states on their own.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu