»   »  రైట్స్ లగడపాటి శ్రీధర్ తీసుకున్నాడు

రైట్స్ లగడపాటి శ్రీధర్ తీసుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎవడి గోల వారిదే, స్టైల్, పోటుగాడు వంటి చిత్రాలతో నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత లగడపాటి శ్రీధర్. ఆయన తాజాగా తమిళ చిత్రం అంజాన్ రైట్స్ తీసుకుని వార్తల్లో నిలిచారు. పోటీపడి మరీ ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. సమంత, సూర్య కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రేడ్ లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. లింగు స్వామి దర్శకత్వం లో రెడీ అవుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులో సికిందర్ టైటిల్ తో ఈ చిత్రం విడుదల చేసే అవకాసం ఉంది.

లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రం 'అంజాన్‌'. సమంత హీరోయిన్. ముంబయి నేపథ్యంలో సాగే ఈ కథలోని ఓ ఐటం సాంగులో హిందీ నటి చిత్రాంగద నటిస్తోంది. 'నవ్వే నా స్పెషాలిటీ.. నేను సిల్క్‌స్మిత కమ్యూనిటీ..' అంటూ సాగే ఈ పాటను వివేకా రాశారు. ఇటీవలే ముంబయిలో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకోసం రూ.కోటితో సెట్‌ వేసిందట చిత్ర యూనిట్‌. ఈ ఒక్క పాట కోసం ఆమె రూ.కోటి పారితోషికం తీసుకున్నట్లు కూడా కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Surya's Anjaan movie rights sold!


'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్‌ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.

లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్‌ డ్రాగన్‌ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.


విద్యుత్‌ జమ్వాల్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌, వివేక్‌, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

English summary

 
 Surya – Samantha starrer gangster genre action flick Anjaan, directed by Lingusamy, is by far one of the most anticipated films this year. The Telugu rights were bought by Lagadapati Sridhar , and the proposed name for the Telugu dubbed version is Sikandar.
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu