»   » నిఖిల్ ‘సూర్య vs సూర్య’ రిలీజ్ డేట్ ఇదిగో

నిఖిల్ ‘సూర్య vs సూర్య’ రిలీజ్ డేట్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘స్వామి రా రా', ‘కార్తికేయ' అంటూ డిఫెంరెంట్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన నిఖిల్ మరో విభిన్న కాన్సెప్టు తో ముందుకు వస్తున్న చిత్రం సూర్య vs సూర్య'. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపద్యంలో ఈ చిత్రం విడుదల తేదీ బయిటకు వచ్చింది. మార్చి 6 న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్ణయించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఏప్రియల్, మే నెలలో వరస పెట్టి పెద్ద చిత్రాలు వస్తూన్న నేపధ్యంలో ఈ తేదీ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. . ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వస్తున్నా ఈ సినిమా ద్వారా త్రిద చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి మల్కాపురం శివకుమార్ నిర్మాత.


Surya V/s Surya confirmed on March 6th

నిఖిల్ మాట్లాడుతూ... "సూర్య అస్తమయం ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి 2014 చివరి సన్ సెట్ కి మించిన మంచి సమయం లేదు' అని ట్వీట్ చేసాడు. అందుకు తగినట్లే పోస్టర్స్ కూడా విభిన్నంగా ఉన్నాయి.


కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


‘హ్యాపీ డేస్' తర్వాత మరోసారి నిఖిల్ కాలేజ్ నేపధ్యంలో చేస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సూర్య vs సూర్య'. ఈ సినిమాతో ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘కార్తికేయ' సినిమాల సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. తనికెళ్ళ భరణి, సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Release date of Nikhil’s next movie is titled “Surya V/s Surya” movie is confirmed as March 6th now.
Please Wait while comments are loading...