»   » 'స్వామి రారా' కన్నడ రీమేక్ ఖరారు..డిటేల్స్

'స్వామి రారా' కన్నడ రీమేక్ ఖరారు..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'స్వామి రారా' చిత్రం ఇప్పుడు కన్నడంలోకి రీమేక్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజు, క్షణ క్షణం చిత్రాలకు గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రం మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్ గత ఫ్లాప్ చిత్రాల ఎఫెక్టుతో ఓపినింగ్స్ లో ఊపు లేకపోయినా తర్వాత టాక్ స్ప్రెడ్ కావటంతో పుంజుకుని నిలదొక్కుకుంది. ఈ చిత్రం కన్నడ వెర్షన్ లో...ప్రజ్వల్ హీరోగా చేస్తూండగా..కలర్స్ స్వాతి పాత్రను..సంజన చెల్లెలు...నిక్కి చేస్తోంది. ఆగస్టు 2 వ వారం నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రం విష్ణు డైరక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ లో ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు.

  ఈ చిత్రానికి హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రొమాంటిక్,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందారు. చిత్రంలో వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. కథ ప్రకారం సూర్య (నిఖిల్‌) ఓ జేబుదొంగ. బతుకుదెరువు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అతనికి స్వాతి (స్వాతి) అనే ఓ పాత్రికేయురాలితో పరిచయం అవుతుంది. మరోవైపు అనంతపద్మనాభస్వామి గుడిలో కనీవినీ ఎరుగని సంపద దొరుకుతుంది. అయితే అందులోంచి ఓ వినాయక విగ్రహం మాయం అవుతుంది. ఆ విగ్రహం కోసం కొంతమంది అన్వేషణ మొదలుపెడతారు. సూర్య, స్వాతిలు కూడా విఘ్నేశ్వరుడి కోసం వేట ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది? ఎవరికి దొరికింది? అనేదే చిత్ర కథ.

  దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నేర పరిశోధన నేపథ్యంగా సాగుతుంది. నిఖిల్‌, స్వాతిల జంట చూడముచ్చటగా ఉంటుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రకూ ఓ ప్రాధాన్యం ఉంటుంది. రవిబాబు విలన్ గా కనిపిస్తారు. అసలే దొంగ. ఆపై ప్రేమలో పడ్డాడు. ప్రేయసి కూడా.. 'దొరికిందంతా దోచేయ్‌.' అని ప్రోత్సహించే రకం. ఆ ఉత్సాహంలో మరింత రెచ్చిపోయాడు. కంటికి కనిపించిందల్లా జేబులోకి తోసేశాడు. వీరిద్దరూ కలసి చేసిన హంగామా ఎలాంటిదో తెలియాలంటే మా సినిమా అన్నారు. సరదాగా సాగే ప్రేమకథ ఇది ''అన్నారు.

  English summary
  Nikhil, Swathi starrer Swami Ra Ra which turned out to be a hit is going to sandalwood. The film's shooting starts from Aug second week. Nikhil congratulating the unit tweeted " congrates bro Urs #swamirara mve is gonna remake in Kannada .Shooting starts on aug 2nd week:-))” thats nice". Prajwal is going to reprise Nikhil’s role whereas Nikki Galrani, the younger sister of Sanjanna, will play the role of a journalist. Vishnu is going to direct the film and the principal shooting is going to begin in the second week of August.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more