»   » ఈ రోజే రిలీజ్...పట్టించుకునే వాడేడి?

ఈ రోజే రిలీజ్...పట్టించుకునే వాడేడి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సరైన పబ్లిసిటీ లేకపోతే ఎప్పుడు సినిమా రిలీజ్ అయ్యిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా జనాలకు తెలియదు. నిర్మాణం మీద డబ్బు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్స్ పబ్లిసిటీ విషయానికి వచ్చేసరికి చల్లబడిపోతారు. ముఖ్యంగా చిన్న మరియు డబ్బింగ్ సినిమాలకు ఈ పరిస్దితి ఎదురౌతోంది. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలకు తెలుగు నాట మంచి గిరాకీ. ఈ రోజు ఆయన డబ్బింగ్ సినిమా స్విస్ బాంక్ కు దారేది విడుదల అవుతుంటే పట్టించుకునే నాధుడు కనపడటం లేదు.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర టైటిల్ పాత్ర పోషించిన టోపీ వాలా సినిమా తెలుగు లోకి స్విస్ బ్యాంక్ కి దారేది పేరుతో తెలుగు లోకి అనువాదమవుతోంది. శ్రీ జర్నీవాలా ఆప్ టోపీవాలా అనే ట్యాగ్ లైన్ తో శ్రీ లక్ష్మీ చెన్న కేశవ మూవీస్ పతాకంపై గుంటూరుకు చెందిన రమేష్ అవులూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్. ఎస్. పగడాల సమర్పిస్తుండగా అవులూరి వెంకయ్య నాయుడు దుర్గా ఎస్టేట్స్ పూర్ణచంద్రరావు నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఆడియో విడుదల జరుపుకున్న ఈ రోజు విడుదల చేస్తున్నారు.

'Swiss Bank ki Daredi' to release on May 2, 2014

నిర్మాత రమేష్ బాబు అవులూరి మాట్లాడుతూ.... ఉపేంద్ర స్టయిల్ లో ఆద్యంతం వినోదం పంచుతూనే ఆలోచింప జేసే వినూత్న కథా చిత్రం స్విస్ బ్యాంక్ కి దారేది. కన్నడంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్దాయిలో ఆడుతుందని భావిస్తున్నాముు అన్నారు.

ఉపేంద్రను ప్రేమగా తన అభిమానులు ఉప్పి దాదా గా పిల్చుకుంటారు. అతను నటించిన ఒక సినిమా తెలుగులోకి డబ్ అవ్వడానికి సిద్ధంగావుంది. గతంలో ఉప్పి తీసిన 'సూపర్' చిత్రం ఇక్కడ కూడా ఘనవిజయమే సాధించింది. వెరైటీ టైటిల్లకు పెట్టింది పేరైన ఉపేంద్ర ఈ కొత్త సినిమాకు 'స్విస్ బ్యాంక్ కు దారేది' అనే నామకరణం చేశాడు. గతంలో 'A', 'స్టుపిడ్', 'H2O' వంటి విచిత్రమైన టైటిల్స్ తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించిన 'టోపీవాలా' కు అనువాద వర్షన్. కామెడీని కలిపిన యాక్షన్ ఎంటెర్టైనర్ గా ఈ సినిమా రూపుదిద్ధుకుంది.

ఉపేంద్రకు జంటగా మహాత్మ ఫేం భావన నటించిన ఈ చిత్రంలో బొమ్మాళి రవిశంకర్ ముఖ్య పాత్రధారి. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే చిత్ర హీరో ఉపేంద్ర సమకూర్చడం విశేషం. కన్నడ చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ డైరెక్టర్ అన్న పేరు తెచ్చుకుని మినిమం గ్యారెంటీని తన ఇంటి పేరుగా మార్చుకున్న యం.జి.శ్రీనివాస్ ఈచిత్రానికి దర్శకుడు అన్నారు. చిత్రానికి మాటలుః హనుమయ్య బండారు, పాటలుః హనుమయ్య బండారు, చల్లాభాగ్య లక్ష్మి -శివమణి, సంగీతం: వి.హరికృష్ణ.

English summary
Upendra and Bhavana starrer ‘Swiss Bank Ki Daredhi’ is ready for release on May 2nd. This variety entertainer is produced by Ramesh Avuluri under the banner Sri Lakshmi Chennakesava Movies. ‘Minimum Guarantee’ Srinivas is the director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu