For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్త ప్రయోగంతో తనీష్.. టాలీవుడ్ చరిత్రలో మొదటి సినిమాగా 'మరో ప్రస్థానం'.. రిలీజ్ ఎప్పుడంటే?

  |

  ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా విభిన్నంగా ఉన్న సినిమాలు అన్నీ దాదాపుగా మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. అందులో భాగంగానే దర్శకనిర్మాతలు సైతం కొత్త కధలు, ప్రయోగాలకే పెద్ద పీత వేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ తాజాగా నటించిన సినిమా 'మరో ప్రస్థానం' ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ముస్కాన్ సేథి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది.

  గత ఏడాది సెప్టెంబర్ 7న తనీష్ పుట్టినరోజు సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మహాప్రస్థానం సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనీ భావించగా సెకండ్ వేవ్ వచ్చి పడింది. దీంతో సినిమాని అప్పటికప్పుడు సినిమాని వాయిదా వేసింది.

  Tanish Maha Prasthanam Movie is set to release on 24th September

  ఇక ఈ థ్రిల్లర్ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మొట్ట మొదటి సింగిల్ షాట్ ప్యాటర్న్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ ప్యాటర్న్‌లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో 'మరో ప్రస్థానం' అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు. జానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర, రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిమించిన ఈ సినిమా ఒక క్రిమినల్ జర్నీగా సాగనుందని అంటున్నారు.

  హీరో తనీష్ మాట్లాడుతూ ఇప్పటిదాకా సింగిల్ షాట్ పాట్రన్ లో ఇండియన్ కమర్షియల్ మూవీ రాలేదని, ఇలాంటి సినిమాలో నటించడం గర్వంగా ఉందని అన్నారు. ఈ టైప్ సినిమా చేయడం కష్టం ఎందుకంటే షాట్ పెట్టాక సీన్ లోని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ గా చేయాలి, లేకుంటే మొత్తం మళ్లీ ఫస్ట్ నుంచి చేయాల్సి వచ్చేదన్న ఆయన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్యాషన్ తో పనిచేశారని అన్నటు. హీరోలు విలన్లు అనే కాన్సెప్ట్ కంటే, సొసైటీలో జరుగుతున్న బర్నింగ్ పాయింట్ ను ఆధారంగా చేసుకుని కథను కొత్తగా దర్శకుడు జాని డిజైన్ చేశారని అన్నారు. ప్రతి నిమిషం మీరు ఆ సినిమాలో ఉన్నట్టు ఫీలవుతారని అన్నారు. ఈ సినిమాకు వసంత కిరణ్, యానాల శివ మాటలు అందించగా సునీల్ కశ్యప్ సంగీతం అందించారు., ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది అనేది చూడాల్సి ఉంది.

  English summary
  As per latest reports Tanish's Maha Prasthanam Movie is set to release on 24th September, official announcement came from unit.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X