»   » ఫ్లాపుల సునామీలో తెలుగు సినిమా (ట్రేడ్ టాక్)

ఫ్లాపుల సునామీలో తెలుగు సినిమా (ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత రెండు వారాల్లో రిలీజైన తెలుగు సినిమాల పరిస్ధితి మరీ ఘోరంగా తయారైంది. గత రెండేళ్లుగా నిర్మాణంలో ఉండి, ఎట్టకేలకు విడుదలైన చార్మి 'సైఆట", ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన 'బద్మాష్‌", నిర్మాత యస్‌.కె.బషీద్‌ తనను తాను దర్శకుడిగా పరిచయం చేసుకుంటూ స్వీయ నిర్మాణంలో రూపొందించిన 'రామ్ ‌దేవ్‌", తన భర్త సూర్యకిరణ్‌ దర్శకత్వంలో ప్రముఖ నటి కళ్యాణి నిర్మించిన 'చాప్టర్‌-6", చిత్రాలతోపాటు ఓ మోస్తరు అంచనాల మధ్య వచ్చిన వరుణ్‌సందేష్‌ 'హ్యాపీ హ్యాపీగా" చిత్రాలు ప్రేక్షకుల్ని ఘోరంగా నిరాశపరిచాయి. భాక్సాపీస్ వద్ద డిజాస్టర్స్ గా నమోదు చేసాయి.

ఇక వీటిలో 'చాప్టర్‌-6" మినహాయిస్తే.. మిగతా నాలుగు చిత్రాలను రూపొందించినవారు కొత్తవారు కావడం మరో విశేషం. దీంతో కొత్త వారికి సినిమా ఇవ్వాలంటే ఎవరు ధైర్యం చేస్తారనే పరిస్ధితి ఏర్పడే అవకాసం ఉంది. అలాగే రిలీజవుతున్న ఈ చిత్రాలు ఎంత లేదన్నా..మినిమం కోటిన్నర ..రెండు కోట్లు ఖర్చుతో రూపొందుతాయి. ఇవి ప్లాప్ అయితే టెక్నీషియన్స్ కే కాక నిర్మాతలుకూ తీరని కష్టమే. చిన్న సినిమా అంటేనే ఎక్కడెక్కడి ఫైనాన్స్ లు తెచ్చి తీస్తూంటారు. ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక ముందుకు వెళ్ళలేక అర్దంకాని అయోమయ స్ధితిలో ఉండిపోయే పరిస్ధితి. కాబట్టి నిర్మాతలు, దర్సకుడు ఎక్కడ లోపముందే సమీక్షించుకుని కొత్త సినిమాలు ప్రారంభిస్తే..ఆది లోనే కొన్ని సమస్యలను నివారించే అవకాశం ఉందన్నది నిజం.

Please Wait while comments are loading...