»   » చూడండి : 'శంకరాభరణం' స్పెషల్‌ టీజర్‌

చూడండి : 'శంకరాభరణం' స్పెషల్‌ టీజర్‌

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: యంగ్ హీరో నిఖిల్‌, నందిత, అంజలి ప్రధాన పాత్రల్లో కోన వెంకట్ రూపొందిన చిత్రం 'శంకరాభరణం'. ఈ చిత్ర యూనిట్ దీపావళి కానుకగా ప్రత్యేక టీజర్‌ని అభిమానుల కోసం విడుదల చేసింది. ఆ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడండి.

ఈ సినిమాని ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పిస్తుండగా, ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు స్వరాలు అందించారు. ఈ చిత్రం దీపావళికి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ 'అఖిల్‌' చిత్రం కోసం డిసెంబర్‌ 4కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

వినూత్నమైన కథతో బిహార్‌ నేపథ్యంలోని గ్యాంగ్స్‌, కిడ్నాపింగ్‌ తదితర అంశాలతో హాస్యాన్ని మేళవించి తెరక్కించారు. ఈ చిత్రంలో చాలా మంది హాస్యనటులు ఉండడం బాగా కలిసి వచ్చే అంశమని పలువురు ప్రశంసించారు.

Shankara2

అలాగే ..అలనాటి 'శంకరాభరణా'నికి ఎక్కడా పోలిక లేకుండా సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సరికొత్త 'శంకరాభరణం' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మొన్నామధ్య హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కొత్త ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఫన్నీగా ఉంటూ.. ..ఇంట్రస్టింగ్ గా సాగింది. మీరూ ఆ ట్రైలర్ ని చూడండి.

రెగ్యులర్,రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మెట్ లో పెద్ద హీరోల తరహాలో ప్రయత్నాలు చేసి బోల్తా పడ్డ నిఖిల్ ..రూట్ మార్చి సక్సెస్ లు ఇవ్వటం మొదలెట్టాడు. స్వామిరారా చిత్రంతో అతని జర్నీ మారిపోయింది. వరస హిట్స్ తో మినిమం గ్యారెంటీ హీరోగా దూసుకుపోతున్నాడు. దాంతో అతని చిత్రం అంటే బిజినెస్ బాగా జరుగుతోంది.


తాజాగా శంకరాభరణం కు కూడా అదే సిట్యువేషన్. స్కై హై ఫిల్మ్స్ వారు నా శంకరాభరణం చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు.

English summary
Sankarabharanam Telugu Movie Diwali Teaser. Sankarabharanam 2015 Telugu movie features Nikhil, Nanditha, Anjali, Deeksha Panth, Sampath Raj, Sapthagiri, Prudhviraj, Rao Ramesh and Shakalaka Shankar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu