»   » నైజాంలో...‘టెంపర్’ 3డేస్ కలెక్షన్ కేక

నైజాంలో...‘టెంపర్’ 3డేస్ కలెక్షన్ కేక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ నైజాం ఏరియాలో సూపర్బ్ కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు సినిమాలకు ప్రధాన మైన మార్కెట్ నైజాం ఏరియానే. తెలుగులో విడుదలైన ఏ సినిమా జయాపజయాలైనా నైజాం కలెక్షన్ల మీదనే ఆధారపడి ఉంటాయి. అలాంటి కీలకమైన టెర్రిటరీలో ‘టెంపర్' మూవీ తొలి మూడు రోజుల్లో 5.41 కోట్లు వసూలు చేసింది.

తొలి మూడు రోజు కలెక్షనే ఈ రేంజిలో ఉందంటే....సినిమా బిజినెస్ పూర్తయ్యే లోపు ఏ రేంజిలో ఉంటుందో? ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు, ట్రేడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయం కోసం చాలా కాలంగా కసిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, అతని అభిమానులకు ఈ చిత్ర ఫలితాలు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయని చెప్పక తప్పదు.


ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Temper collects 5.41 crores in Nizam

అమెరికాలోనూ దుమ్ము రేపుతోంది. అమెరికాలో దాదాపు 120 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఆదివారం వరకు ఈ చిత్రం ఇక్కడ $871000 వసూలు చేసింది. ఈ రోజు లేదా రేపు ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుందని భావిస్తున్నారు.


ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) సూపర్ కలెక్షన్లు సాధించింది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఈచిత్రం రూ. 17.67 కోట్లు వసూలు చేసింది. మరో వైపు పక్కరాష్ట్రం కర్ణాటకలోనూ రికార్డు స్థాయిలో తొలి మూడు రోజుల్లో రూ. 3 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో ధనుష్ నటించిన ‘అనేగన్', అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్' చిత్రాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సమయంలోనూ ‘టెంపర్' అక్కడ మంచి వసూలు రాబట్టింది.


ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 24 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు.


ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
According to the latest reports, Temper movie has collected 5.41 crores in the first three days of its release in the Nizam area.
Please Wait while comments are loading...