»   » అఫీషియల్: ‘టెంపర్’ ఫస్ట్ వీక్ రూ.40 కోట్లు

అఫీషియల్: ‘టెంపర్’ ఫస్ట్ వీక్ రూ.40 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం విజయవంతంగా ఈ రోజుతో వారం కంప్లీట్ చేసుకుంది. తొలివారం బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సుమారు రూ. 40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినిమా ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ అంచనా వేసారు. ఈ రోజు పూర్తయిన తర్వాత ఏరియా వైజ్ ఎక్కడెక్కడ ఎంత అనే వివరాలు అంకెలతో సహా వెల్లడి కానున్నాయి.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రం రెండు వారాల్లో రూ. 60 కోట్లు వసూలు చేస్తుందని హీరో, నిర్మాత సచిన్ జోషి జోష్యం చెప్పారు. ‘టెంపర్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 42 కోట్ల వరకు రాబట్టింది. రెండు వారాలు పూర్తయ్యే నాటికి వసూళ్లు రూ. 60 కోట్లు దాటుతాయి' అంటూ సచిన్ జోషి పేర్కొన్నారు.


'Temper' collects Rs. 40 crore in first week

కాగా...‘టెంపర్' చిత్రాన్ని సచిన్ జోషి హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు అలాంటి పవర్ ఫుల్ పాత్రకు అతను సెట్ కాడనే విమర్శలు సైతం వచ్చాయి. దీంతో వెంటన స్పందించిన సచిన్ జోషి....‘నేను టెంపర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తాను. అంతే కానీ అందులో నటించడం లేదు' అని స్పష్టం చేసాడు.


ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.'

English summary
Jr. NTR’s Telugu action-drama “Temper”, which is directed by Puri Jagannadh, has collected a whopping Rs. 40 crore in its first week worldwide. “The film is turning out to be a blockbuster. In its first week, it has grossed Rs. 40 crore approximately worldwide,” trade analyst Trinath told.
Please Wait while comments are loading...