»   » ట్రేడ్ ని కంగారుపెడుతున్న ‘టెంపర్’ క్లోజింగ్ కలెక్షన్స్

ట్రేడ్ ని కంగారుపెడుతున్న ‘టెంపర్’ క్లోజింగ్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ ప్రారంభంలో బాక్సాఫీసు వద్ద ప్రారంభంలో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లడంతో పాటు మంచి కలెక్షన్లు కురిపించింది. అయితే తర్వాత వరల్డ్ కప్ రావటం, రామానాయుడు మృతి వంటి మరిన్ని అంతర్గత కారణాలతో సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయి డీలా పడింది. దాంతో రన్ స్లో అయ్యి...కలెక్షన్స్ చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి. కానీ ఫైనల్ గా టెంపర్ క్లోజింగ్ కలెక్షన్స్ చూసిన ట్రేడ్ మాత్రం షాక్ కు గురి అయ్యింది. ఆల్ టైమ్ తెలుగు చిత్రాల హైయిస్ట్ గ్రాసర్స్ లిస్ట్ లో స్దానం సంపాదించుకుంది. అది 12 వస్ధానం. ఈ చిత్రం దాదాపు పూర్తి రన్ కు 45 కోట్లు వసూలు చేసింది. తారక్ కెరీర్ లో బాద్షా చిత్రం 47.5 కోట్లు వసూలు చేసి హైయిస్ట్ షేర్ సంపాదిస్తే..ఈ చిత్రం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది ట్రేడ్ లో ఊహించని విషయం కావటం విశేషం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ట్రేడ్ లో చెప్పుకునే లెక్కలు ప్రకారం క్లోజింగ్ డే నాటికి వచ్చిన కలెక్షన్స్... ఏ ప్రాంతాల్లో ఎంతెంత


ఏరియా కలెక్షన్స్


నైజాం - రూ 11.70 కోట్లు


సీడెడ్ - 6.45 కోట్లు


ఉత్తరాంధ్ర- 3.50 కోట్లు


గుంటూరు- 3.13 కోట్లు


కృష్ణా - 2.07 కోట్లు


తూర్పు గోదావరి- 2.22 కోట్లు


పశ్చిమ గోదావరి- 1.75 కోట్లు


నెల్లూరు- 1.30 కోట్లు


మొత్తం (ఆంధ్రా మరియు తెలంగాణా) 32.12 కోట్లు


బెంగుళూరు,మిగిలిన కర్ణాటక - 5.25 కోట్లు


తమిళనాడుతో సహా...దేశంలో మిగతా ప్రాంతాలు - 1.45 కోట్లు


ఓవర్ సీస్ 5.65 కోట్లు


మొత్తం (ప్రపంచవ్యాప్తంగా) 44.47 కోట్లు


Temper Total Closing Collections

గమనిక: ఇవన్నీ కేవలం ట్రేడ్ లో చెప్పుకోబడుతున్న లెక్కలు మాత్రమే. అధికారిక లెక్కలు కావు.


ఇవికాకుండా...


ఈ చిత్రం హిందీ లో రీమేక్ చేయటానికి సచిన్ జోషి సిద్దపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఈ నేపధ్యంలో హిందీ వెర్షన్ కు గన్ డే, రామ్ లీల చిత్రాల హీరోగా రణవీర్ సింగ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా సచిన్ ..రణబీర్ ని ఎప్రోచ్ అయినట్లు సమాచారం. బ్లాంక్ చెక్ ని రెమ్యునేషన్ గా ఆఫర్ చేసాడని, అయితే రణబీర్..చిత్రం చూసి చెప్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రణబీర్ తప్పక ఒప్పుకుంటాడు అంటున్నారు.


శివబాబు బండ్ల సమర్పించిన సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ లాంటి పార్టీని ఏర్పాటు చేసిన నిర్మాత బండ్ల గణేష్ ... టెంపర్ 2 ని ప్రకటించారు. ఆయన ట్వీట్ చేస్తూ...‘' మీ అభిమానం, ప్రేమతో...టెంపర్ 2 రెడీ చేస్తాము ‘' అన్నారు.


ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించిన ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది.


ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ జంటగా నటించిందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కొట్టారు.


టెంపర్ కథేమిటంటే...


వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) ఓ పూర్తి అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్ వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ యానిమల్ లవర్ (కాజల్) తో ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో దయ...దయగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Full run of NTR and Kajal Agarwal starrer 'Temper' collecting a Worldwide share of nearly Rs 45 crore.
Please Wait while comments are loading...