Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రిలీజ్‌కు ముందే టెనెట్ రికార్డు.. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కోట్లలో వసూళ్లు.. డిసెంబర్ 4న విడుదల
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన టెనెట్ భారీ స్థాయిలో భారత్‌లో రిలీజ్‌కు సిద్దమైంది. వాస్తవానికి జూన్ 2020లో ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు భారత్‌లో రిలీజ్‌కు అధికారికంగా డేట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ పెద్ద మొత్తంలో జరగడడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టెనెట్ సినిమా రిలీజ్ గురించి మరిన్నీ వివరాలు.

హాలీవుడ్‌లోకి డింపుల్ కపాడియా
టెనెట్ చిత్రానికి క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించగా.. హోయ్‌టే సినిమాటోగ్రఫిని అందించారు. డెన్మార్క్, ఈస్టోనియా, ఇటలీ, నార్వే, యూకే, యూఎస్, ఇండియాలో షూట్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా నటించారు. ఈ చిత్రంలో డింపుల్ పాత్రకు విశేషంగా ఆదరణ లభిస్తున్నది.

70 దేశాల్లో రిలీజ్
విదేశాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు 70 దేశాల్లో ఈ చిత్రం రిలీజ్ అయింది. యూఎస్, యూకే, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, రష్యా, కొరియా, జపాన్‌తోపాటు పుల దేశాల్లో రిలీజ్ అయింది. డిసెంబర్ 4వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధమైంది.

రిలీజ్‌కు ముందే 5 కోట్లు వసూలు
ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకొంటున్న టెనెట్ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. కరోనావైరస్ పరిస్థితుల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. దాదాపు 30 వేలకుపైగా టికెట్లు అడ్వాన్సు బుకింగ్ రూపంలో అమ్ముడుపోయినట్టు సమాచారం. అడ్వాన్సు బుకింగ్ రూపంలో సుమారు 5 కోట్ల రూపాయలు సంపాదించింది.

డిసెంబర్ 4న రిలీజ్
టెనెట్ చిత్రంలో భారీ సంఖ్యలో నటీనటులు భాగమయ్యారు. జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ పాటిన్సన్, ఎలిజబెత్ డెబికి, కెన్నెత్ బ్రానగ్, మైఖేల్ కెయిన్, క్లెమెన్స్ పోజీ నటించారు. హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది.